కొమురవెల్లి మ‌ల్ల‌న్న కల్యాణం, జాతరను ఘ‌నంగా నిర్వ‌హించాలి: మంత్రి కొండా సురేఖ

కొమురవెల్లి మ‌ల్ల‌న్న కల్యాణం, జాతరను ఘ‌నంగా నిర్వ‌హించాలి. ఎండోమెంటు, జిల్లా ఉన్న‌తాధికారుల‌కు దేవాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం, 18 జనవరి 2026 నుండి 10 (ఆది)వారాలపాటు, 16 మార్చి 2025 వరకు జాతర నిర్వహణకు నిర్ణయం. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల‌ని మంత్రి సురేఖ దిశానిర్ధేశం. దేవాదాయ శాఖ, ఇత‌ర నిధులతో ఆలయ ప్రగతికి చేపడుతున్న పనులపై మంత్రి సురేఖ ఆరా తీశారు. సచివాలయంలోని దేవాదాయ మంత్రి శాఖ ఛాంబర్​ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రివ్యూ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎండోమెంటు ప్రిన్స పల్​ సెక్రటరీ, శైల‌జా రామ‌య్య‌ర్‌, కమిషనర్​ హ‌రీష్‌.