తెలంగాణ రాష్ట్ర గీత రచయిత కవి అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలందరూ ఒకే వేదికపైకి రావాలి. అందెశ్రీ అంత్యక్రియలు… కవులు–కళాకారులకు సీఎం ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను “రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు… తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి” అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ “సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షాన నిలిచిన నాయకుడు”. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి కళాకారులకు అధిక గౌరవం దక్కేలా తీసుకున్న చర్యల వరకూ… సీఎం రేవంత్ రెడ్డి దళిత–బహుజన వర్గాల పక్షాన నిలిచిన నాయకుడని మంత్రి గుర్తుచేశారు. “సీఎంకు కృతజ్ఞతగా, దళిత ఐక్యత సందేశంగా అందెశ్రీ సంతాప సభను విజయవంతం చేద్దాం”. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో దళితులు ఒక్కటై విజయాన్ని సాధించినట్లు… ఈ సభలో కూడా సమజం ఒకే తాటిపైకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. “కవులు–కళాకారులకు ఇంత గౌరవం ఇచ్చిన సీఎం ఇప్పటివరకు లేరు”. అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం స్వయంగా పాల్గొనడం… కళాకారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. “ఈ అంతక్రియల్లో పాల్గొనడం నాకు అదృష్టం, భాగ్యంగా భావిస్తున్న. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో అదృష్టం అని మంత్రి తెలిపారు. “తెలంగాణ రాష్ట్ర గీతమే కాదు… తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ గౌరవం అందెశ్రీ రచనల్లో ఉంది”. అందెశ్రీ రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అని మంత్రి పేర్కొన్నారు. సంతాప సభను సాంస్కృతిక–సామాజిక ఘట్టంగా… ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, సంఘాలు అందరూ పాల్గొనే వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు.

సభ రూపకల్పన – మంత్రిపేరుతో ప్రకటించిన ముఖ్య సూచనలు
● అందెశ్రీ సేవలను ప్రతిబింబించే కవిసమ్మేళనం
● సాంస్కృతిక నివాళులు, జానపద–ప్రజా కళారూపాల కార్యక్రమాలు
● అన్ని సంఘాలతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
● దళిత ఐక్యత – తెలంగాణ స్ఫూర్తి – కళాకారుల గౌరవం అనే మూడు ప్రధాన థీమ్స్ చుట్టూ సభ రూపకల్పన

ఈ సమావేశంలో ప్రొఫెసర్ కాశీం (ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్), ప్రొఫెసర్ విద్యాసాగర్ (వ్యవసాయ విశ్వవిద్యాలయం), టీఎంఆర్‌పీఎస్ నేతలు మేడి పాపయ్య, ఇటుక రాజు, రమేష్, సతీష్ మాదిగ, జెన్కో మేడి రమేష్, సంగీతం రాజలింగం, అరెపల్లి రాజేందర్, మోహన్, చింతా బాబు, మంచాల యాదగిరి, గంట సుదర్శన్, అందె రుక్కమ్మ, ముంజగాల విజయ్ కుమార్, మల్లెపోగు శ్రీనివాస్, జీడి నరసింహ, INTUC శివ, భీమ్, రవికిరణ్, శివ, లాజర్, సుగుణమ్మ, యోసేపు, యాదగిరి, శంకర్, ఓయూ రీసెర్చ్ స్కాలర్ పాల్వాయి నాగేష్ తదితరులు సూచనలు తెలియజేశారు. ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకుల సూచనల మేరకు సభ కార్యాచరణ ప్రణాళికను మంత్రి ఆమోదించారు.