తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు బాధ్యతగల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు 18 నవంబర్ 2025న ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించింది. మండలిలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు, సిబ్బంది మరియు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుండి రక్షించేందుకు అవగాహన, అప్రమత్తత, వ్యక్తిగత బాధ్యత అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. “ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా, పిల్లలు మరియు యువ మేధావులు మాదక ద్రవ్యాల ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు. పాఠశాల పిల్లలు, యువత మాదక ద్రవ్యాలు కలిగించే శాశ్వత హానిని తెలియక, వాటిని పెద్దగా పట్టించుకోకుండా, భవిష్యత్తుతో సరదాగా ప్రయోగం చేస్తున్నట్టుగా భావించి వాడుతున్నారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడిపి, వారిని మార్గనిర్దేశం చేసి, మాదక ద్రవ్యాల దీర్ఘకాలిక ప్రభావాన్ని వివరించడం అత్యంత అవసరం. సమస్య పూర్తిగా పెరిగిన తర్వాత గుర్తించడం కన్నా ముందే అవగాహన కల్పించాలి.అదే సమయంలో, అక్రమ మాదక ద్రవ్య తయారీని నియంత్రించడంలో టీజీపీసీబీ కి కూడా పెద్ద బాధ్యత ఉంది. కొన్ని అనారోగ్యకరమైన పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా రసాయనాలు మరియు ముడి పదార్థాలను తయారు చేస్తూ, పరోక్షంగా మాదక ద్రవ్య నెట్వర్క్లకు తోడ్పడుతున్నాయి. ఇలాంటి ఉల్లంఘనలను కఠినంగా మరియు ఖచ్చితంగా ఎదుర్కోవడం సమాజాన్ని, ముఖ్యంగా యువతను, మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటానికి అత్యవసరం” అని ఆయన అన్నారు. ప్రతిజ్ఞను సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యు.జి. ప్రసన్న కుమార్ అందించారు. సమాజంలో మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నివారించేందుకు సామూహిక అవగాహన మరియు చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు.
పాల్గొన్న వారు మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండాలని, వాటి దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలని, సంస్థలోగానీ సంస్థ వెలుపలగానీ ఇతరులను మాదక ద్రవ్య రహిత జీవన శైలిని అలవరచుకునేలా ప్రోత్సహించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ఉద్యోగుల సంక్షేమం మరియు సామాజిక, ప్రజా ఆరోగ్య రంగాలలో టీజీపీసీబీ యొక్క భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుoదని అని తెలిపారు
