అన్నవరం ఆలయానికి కొత్త పాలకమండలిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి. ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు 16 మందికి ఈ ట్రస్ట్‌ బోర్డులో అవకాశం కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు పాలక మండలిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుడు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపారు. కాగా, ఇప్పటికే విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు నూతన పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు వీరే..
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్‌)2. సాధు దుర్గ3. కర్రి భామిరెడ్డి4. కలగా రామజోగేశ్వర శర్మ5. వాసిరెడ్డి జగన్నాథం6. నత్రా మహేశ్వరి7. గాదె రాజశేఖరరెడ్డి8. చిట్టూరి సావిత్రి9. అప్పారి లక్ష్మి10. ముత్యాల వీరభద్రరావు11. మోకా సూర్యనారాయణ12. చాగంటి వెంకట సూర్యనారాయణ13. ములికి సూర్యవతి14. బి. ఆశాలత15. కర్రా వెంటకలక్ష్మి16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు)