- 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో విద్య, స్కిల్స్, ఉపాధి రంగాలకు పెద్దపీట
- దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులను సృష్టించింది జేఎన్టీయూ
- చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, పుస్తకాలు ల్యాబ్ లకు దగ్గరగా ఉండండి
- స్టార్టప్ లకు కేంద్రంగా తెలంగాణ సిద్ధమైంది
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో టెక్నికల్ ఎడ్యుకేషన్ ను ఆధునికరిస్తున్నాం
- జేఎన్టీయూ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది
- జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం, తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి, ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీయూ అనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సావనీర్ ను ఆవిష్కరించి, పూర్వ విద్యార్థులను సన్మానించిన అనంతరం ప్రసంగించారు. గత అరవై ఏళ్లలో లక్షలాది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిపాలకులు, స్వప్నదృష్టులను తీర్చిదిద్దిన ఈ పవిత్ర స్థలంలో నిలబడి మాట్లాడటం ఒక అపూర్వమైన ఆనందం అని డిప్యూటీ సీఎం అన్నారు. జేఎన్టీయూ సంస్థకు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు ఉండడం ఎంతో సార్థకమైందనీ అభిప్రాయ వ్యక్తం చేశారు. ఎందుకంటే, భారత భవిష్యత్తు విజ్ఞానంపై, ఆధునిక సంస్థలపై, యువత ధైర్యంపై నిర్మితమవుతుందని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వసించారు అని తెలిపారు. సాంకేతిక విశ్వవిద్యాలయాలు దేశ పురోగతికి ఇంజిన్‌గా మారాలి అని ఆయన కలగన్నారు, 1965లో నాగార్జునసాగర్ ఇంజనీరింగ్ కాలేజ్‌గా ప్రారంభమై, 1972లో దేశ మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఎదిగి, నేడు 100 ఎకరాల కూకట్పల్లి క్యాంపస్‌గా JNTU ప్రపంచ ఖ్యాతిని పొందింది అన్నారు. JNTU ఆ కలను మాత్రమే కాదు, దానిని అధిగమించి అనేక విజయాలను సాధించింది అన్నారు. గన్‌ఫౌండ్రీ, మసాబ్ ట్యాంక్ నుండి AI, క్వాంటమ్ టెక్నాలజీ, గ్లోబల్ ఇన్నోవేషన్ వరకు… JNTU ప్రస్థానం దేశ చరిత్రలో లిఖించదగిన గొప్ప సాహసోపేతమైన అధ్యాయం అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం jntu కి సంబంధించిన ప్రస్థానాన్ని ఒక సామెత ద్వారా వివరించారు. “సిలికాన్ వాలీలో ఒక రాయి విసిరితే అది IITian లేదా JNTU అలుమ్ని మీద పడుతుంది.” సర్కార్ ప్రతినిధిగా నేను రాళ్లు విసరమని చెప్పలేను… కానీ ఆ గణాంకం మాత్రం వాస్తవమని jntu విద్యార్థుల ప్రస్థానం గురించి చతురొక్తులతో సబిక్కులను నవ్వించారు. ISRO నుండి Google వరకు, DRDO నుండి Tesla వరకు, పబ్లిక్ సెక్టార్ నాయకత్వం నుండి డీప్-టెక్ స్టార్టప్‌ల వరకు JNTU భారతదేశాన్ని ముందుకు నడిపించిన తరాలను సృష్టించిందనీ డిప్యూటీ సీఎం వివరించారు.
జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అలుమ్ని జాబితా ఒక హాల్-ఆఫ్-ఫేమ్ మాదిరిగా ఉంది అన్నారు. డా. జి. సతీష్ రెడ్డి, డా. టెస్సీ థామస్,డా. అవినాష్ చంద్రా, మహేందర్ రెడ్డి మరియు నిత్యం నిశ్శబ్దంగా దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్న వేలాది ఇంజనీర్లు ఇక్కడి వారే అని వివరించారు. Jntu ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, ఒక జాతీయ ఆస్తి డిప్యూటీ సీఎం అభివర్ణించారు. JNTU ఎల్లప్పుడూ తెలంగాణకు బలమైన భాగస్వామి నిజాయితీతో ప్రవేశ పరీక్షలు, అనుబంధ కాలేజీలకు నైతిక మార్గనిర్దేశం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం 215 కాలేజీలు, 3.5 లక్షల విద్యార్థులు JNTU కుటుంబంలో భాగమవడం దాని ప్రభావం, వ్యాప్తిని తెలియజేస్తుందని అన్నారు. ప్రతీ వర్షంలో మేము మరమ్మతు చేసే గుంతల కంటే ఎక్కువ ఇంజనీర్లను JNTU తయారు చేసింది…! ఈ రెండూ తెలంగాణ అభివృద్ధికి అత్యవసరం అని ప్రభుత్వ ప్రతినిధిగా తాను భావిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగ పునర్నిర్మాణం జరుగుతోందనీ తెలిపారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం రిక్రూట్మెంట్ పరీక్షలో నమ్మకాన్ని, పారదర్శకతను, గౌరవాన్ని పునరుద్ధరించాము అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో టెక్నికల్ ఎడ్యుకేషన్ ను ఆధునికీకరిస్తున్నాం, ITIs ను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం, ఇండస్ట్రీ 4.0 యుగానికి యువతను సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు. 65 ఐటిఐ లను ఇప్పటికే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం రాష్ట్రంలో మొత్తం 104 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జేఎన్టీయూ సరి సమానంగా భారత్ స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. విద్య ఖర్చు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టుబడి అన్నారు. JNTU యొక్క న్యాయమైన సమస్యలైన భూమి లీజ్ సమస్య పరిష్కారం,
లీజ్ రెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరణకు ₹800 కోట్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది అన్నారు. ఉద్యోగం కోరేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగండి, ఇంజనీరింగ్‌లో సమయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారు… ఒత్తిడిని బ్యాక్‌లాగ్‌లలో కొలుస్తారు అని నాకు తెలుసు! కానీ మార్కుల కంటే ముఖ్యమైనది — ఆసక్తి, ధైర్యం, ఆవిష్కరణ కానీ ప్రస్తుత విద్యార్థులకు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు.
ప్లేస్మెంట్లు ముఖ్యం, ప్యాకేజీలు ముఖ్యం. కానీ భవిష్యత్తు అవకాశాలు సృష్టించే వారికి చెందుతుంది, వేచి చూసేవారికి కాదు అన్నారు. 2027 నాటికి భారతదేశంలో 1000+ యూనికోర్న్ స్టార్టప్‌లు ఎదగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారడానికి సిద్ధమైంది అని తెలిపారు. Jntu లో ఇప్పటికే రోల్ మోడల్స్ ఉన్నారు
జాతీయ గుర్తింపు పొందిన R. నితిన్ వంటి స్టార్టప్ నాయకులు. ఇలాంటి కథలు మరిన్ని jntu నుంచి రావాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. EDC, టెక్ బిజినెస్ ఇన్క్యూబేటర్, J-Hub అన్నిటిని ఉపయోగించండి. ప్రభుత్వం మీతో పాటు నడుస్తుంది అని భరోసా కల్పించారు. మీ స్టడీ టైమ్ కంటే స్క్రీన్ టైమ్ ఎక్కువైతే, మీ డిగ్రీ ప్రమాదంలో ఉంటుంది… మరియు మీ బ్యాటరీ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది, చెడువ్యసనాలకు దూరంగా ఉండండి. పుస్తకాలు, ల్యాబ్‌లు, మెంటర్లు, అవకాశాలకు దగ్గరగా ఉండండి అని ప్రస్తుత విద్యార్థులకు ప్రేమ పూర్వక సలహా ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. JNTU విద్యార్థులు ఇండియాను నడిపించాలి, ఇండియా పరుగులు తీస్తున్నప్పుడు మొబైల్ స్క్రోలింగ్‌లో ఉండకండి అన్నారు. భవిష్యత్ అవసరాలు ప్రపంచం వేగంగా మారుతోంది. పరిశ్రమకు నైపుణ్యవంతులైన, ఇన్నోవేటివ్, ఇండస్ట్రీ-రెడీ ఇంజనీర్లు కావాలి. కరికులం రిఫార్మ్, ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ భాగస్వామ్యం, మల్టీ-డిసిప్లినరీ అభ్యాసం మరింత బలపడాలి అన్నారు. కొత్త టెక్నాలజీలతో పాటు కోర్ బ్రాంచ్‌లను బలపరచాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో, ఈ దేశాన్ని సేవించడంలో ముందుండే ఒక గొప్ప సంస్థను నిర్మించినందుకు అధ్యాపక వర్గానికి, పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. సాహసంగా కలలు కనండి, భయంలేకుండా ఆవిష్కరించండి. వినయంతో సమాజానికి సేవ చేయండి అని డిప్యూటీ సీఎం విద్యార్థులకు సూచించారు.మొదటి 60 సంవత్సరాలకంటే వచ్చే 60 సంవత్సరాలు మరింత మహోన్నతంగా jntu ఉండాలనీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్, రిజిస్టర్ కే వెంకటేశ్వరరావు, ఉన్నతాధికారులు కృష్ణ ఆదిత్య, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.