తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న క్రమంలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. జిల్లాల్లో ఎక్కువగా యువ ఐపీఎ్‌సలను నియమించారు. మల్టీజోన్-2కు అదనపు డీజీగా ఉన్న దేవంద్ర సింగ్ చౌహన్‌ను ఏడీజీ పర్సనల్‌గా నియమిస్తూ మల్టీజోన్-2 పర్యవేక్షణ అదనపు బాధ్యతగా అప్పగించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అడ్మిన్ విభాగం జాయింట్ కమిషనర్‌గా ఉన్న పరిమళ హన నూతన్ జాకబ్‌ను సీఐడీ డీఐజీగా నియమించారు. మహిళా భద్రతా విభాగం ఎస్పీగా ఉన్న మైలాబత్తుల చేతనను పోలీసు అకాడమీ డిప్యూటీ డైరక్టర్‌గా బదిలీ చేశారు. వికారాబాద్ ఎస్పీగా ఉన్న కె.నారాయణరెడ్డిని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ డీసీపీగా, రాచకొండ కమిషనరేట్‌లోని మల్కాజిగిరి డీసీపీగా ఉన్న పీవీ పద్మజను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీ ఎస్పీగా ఉన్న పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్రావును నాగర్‌కర్నూల్ ఎస్పీగా నియమిస్తూ.. ఇక్కడున్న గైక్వాడ్ వైభవ్ రఘునాధ్ను హైదరాబాద్ కమిషనరేట్‌లోని టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా ఉన్న ఖరేకిరణ్ ప్రభాకర్‌ను హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా నియమిస్తూ.. ఇక్కడున్న స్నేహ మెహ్రాను వికారాబాద్ జిల్లా ఎస్పీగా నియమించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్పీగా ఉన్న చెన్నూరి రూపే్‌షను హైదరాబాద్ సిటీలోని ఎస్ఎం ఐటీ డీసీపీగా నియమించారు.
ములుగు ఎస్పీగా ఉన్న డాక్టర్ శబరీ్షను మహబూబాబాద్ ఎస్పీగా నియమించి ఇక్కడున్న రామ్‌నాథ్‌ను ములుగు ఎస్పీగా బదిలీ చేశారు. రెండవ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న నిఖితా పంత్‌ను కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీగా నియమించి.. ఇక్కడున్న సుభా్‌షను గవర్నర్ ఏడీసీగా బదిలీ చేశారు. గవర్నర్ ఏడీసీగా ఉన్న సిరిసెట్టి సంకీర్త్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా నియమించారు. వనపర్తి ఎస్పీగా ఉన్న పి.గిరిధర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్పీగా నియమించారు. సీఐడీ ఎస్పీగా ఉన్న బి.రామిరెడ్డిని రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డీసీపీగా నియమిస్తూ.. ఇక్కడున్న కరుణాకర్‌ను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉన్న సీహెచ్ శ్రీధర్‌ను రాచకొండ కమిషనరేట్‌లోని మల్కాజిగిరి డీసీపీగా నియమించారు. భైంసా ఎస్డీపీవోగా ఉన్న అవినాష్ కుమార్‌ను కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేసి.. ఇక్కడున్న నరేందర్‌ను బదిలీ చేశారు. ఉట్నూర్ ఎస్డీపీవోగా ఉన్న కాజల్‌ను పదోన్నతిపై అక్కడే ఏఎస్పీగా నియమించారు. అలాగే భువనగిరి ఎస్డీపీవోగా ఉన్న రాహుల్ రెడ్డిని పదోన్నతిపై అక్కడే ఏఎస్పీగా నియమించారు. వేములవాడ ఎస్డీపీవోగా ఉన్న శేషాద్రిని రెడ్డిని జగిత్యాల అదనపు ఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేశారు. ములుగు ఎస్డీపీవోగా ఉన్న శివం ఉపాధ్యాయను అక్కడే అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాను భైంసా అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. దేవరకొండ ఏఎస్పీగా ఉన్న పి.మౌనికను అదిలాబాద్ అదనపు ఎస్పీ(అడ్మిన్)గా నియమించారు. గ్రేహౌండ్స్ విభాగం ఏఎస్పీలుగా ఉన్న మన్నన్ భట్‌ను ఏటూరునాగారం ఏఎస్పీగా, సాయికిరణ్‌ను నిర్మల్ ఏఎస్పీగా, రుత్విక్ సాయిని వేములవాడ ఏఎస్పీగా, యాదవ్ వసుంధరను సత్తుపల్లి ఏసీపీగా బదిలీ చేశారు.