అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047’ గ్లోబల్ సమ్మిట్‌కు రావలంటూ అసోం సీయం హిమంత బిస్వా శర్మను.. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ నిర్వహిస్తున్న సందర్భంగా గువహాటిలో హిమంతను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిపేలా చేస్తోన్న ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరారు. సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావును అసోం సీఎస్ డా. రవి కోట(ఏపీ), అడిషనల్ సీఎస్ కళ్యాణ చక్రవర్తి (తెలంగాణ) కలిశారు.