ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం

ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రితో సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించారు.
1. పార్బాయిల్డ్ రైస్ (KMS 2024-25 రబీ) అదనపు కేటాయింపు కోసం విజ్ఞప్తి చేసారు.KMS 2024-25 (ఖరీఫ్ & రబీ) కోసం GOI 30.00 LMT బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించింది. 2024 – 25 రబీ నుండి ఇప్పటి వరకు 17.06 LMT పార్బాయిల్డ్ మరియు 0.87 LMT ముడి బియ్యం సరఫరా చేయడం జరిగింది. పెండింగ్‌లో ఉన్న బ్యాలెన్స్: 2.34 LMT పార్బాయిల్డ్ మరియు 14.26 LMT ముడి బియ్యం. రబీ సీజన్ లో ప్రధానంగా పార్బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటుంది. KMS 2024-25 (రబీ) కింద అదనపు 10 LMT పార్బాయిల్డ్ రైస్ కేటాయింపు కోసం అభ్యర్థించడం జరిగింది.
2. పార్బాయిల్డ్ రైస్ తరలింపు కోసం అదనపు రేక్‌ల అవసరం. ప్రస్తుత సంవత్సరం రేక్ తరలింపు గత సంవత్సరం (జనవరి- నవంబర్) తో పోలిస్తే 13.5 LMTల కొరత ఉంది. దీని వలన FCI గోడౌన్లలో పార్బాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోయాయి, దీంతో CMR డెలివరీలు ఆలస్యం అయ్యాయి. తెలంగాణలోని FCI డిపోల నుండి పార్బాయిల్డ్ బియ్యం తరలింపును వేగవంతం చేయడానికి అదనపు రేక్‌లను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి.
3. ఖరీఫ్ 2024-25 కోసం CMR డెలివరీ వ్యవధి పొడిగించాలి. CMR డెలివరీ సమయం 12.11.2025 నాటికి ముగిసింది. పరిమిత FCI నిల్వ స్థలం మరియు అధిక సేకరణ పరిమాణాల కారణంగా 2.27 LMT ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఖరీఫ్ 2024-25 కోసం CMR డెలివరీల కోసం 60 రోజుల పొడిగించాలని విజ్ఞప్తి.
4. తెలంగాణలో నిల్వ సామర్థ్యం పెంపుదల. ప్రస్తుత SWC/CWC నిల్వ సామర్థ్యం: -65.00 LMT, వివిధ ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి. FCI అద్దెకు తీసుకోగల గోడౌన్ల రకంపై పరిమితుల కారణంగా (ఉదా., రైల్వే సైడింగ్ అవసరం లేదా గూడ్స్ షెడ్‌కు సమీపంలో) నిల్వ కొరతను ఎదుర్కొంటుంది. ఈ నిల్వ పరిమితులు సకాలంలో CMR డెలివరీలను ప్రభావితం చేస్తున్నాయి. సంబంధిత నిల్వ పథకం కింద FCI ద్వారా అదనంగా 15 LMTల నిల్వ సామర్థ్యాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగింది.

    Fci Cmd గారికి విజ్ఞప్తి..
    1) ఫిబ్రవరి 2026 నాటికి మేము 18 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉన్నందున KMS 24-25 కోసం 10 నుండి 12 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ అదనపు కోటా ఇవ్వాలి. మిల్లర్లు ప్రస్తుత ధాన్యం సేకరణ విషయంలో వెనుకాడుతుండటం మరియు మిల్లుల వద్ద స్థలం లేకపోవడం వల్ల కొత్త ధాన్యం సేకరణ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. 2) 7-8 సంవత్సరాల హామీతో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరిన్ని గోడౌన్లను నిర్మాణం చేయడానికి PEG పథకాన్ని పునరుద్ధరించాలి. (02 సంవత్సరాల రాష్ట్ర హామీ మరియు 06 సంవత్సరాల FCI హామీ). 3) తదుపరి 4 నెలలకు నెలకు 0.5 లక్షల బాయిల్డ్ రైస్ తరలించాలి.