మూసిన గదిలో రాసిన కాగితం కాదు.. ఇది తెలంగాణ ప్రజల పత్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • త్రీ ట్రిలియన్ సంఖ్య కాదు… తెలంగాణ రూపాన్ని మార్చే శక్తి
  • క్యూర్, ప్యూర్, రేర్ తెలంగాణ అభివృద్ధి కథ
  • 2047 కు నెట్ జీరో మా లక్ష్యం
  • ఆతిథ్యం తోనే తెలంగాణకు గుర్తింపు

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ, అందుకే ఇది ప్రభుత్వపు పత్రం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల పత్రం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉంది 2047 నాటికి నెట్ జీరో సాధించడమే లక్ష్యం అన్నారు. ఆర్థికాభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి విరుద్ధం కాదు, ఇకపై ఇవి పరస్పర సహకారాలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ వచ్చినప్పుడు చాలా విషయాలు చెబుతారు, కానీ ముఖ్యంగా మేము అతిథులను ఎలా గౌరవిస్తామన్నదే మా అసలు గుర్తింపు అని అన్నారు. మేము అతిథిని చూసి చిరునవ్వు చిందించడం మాత్రమే కాదు వేడి వేడి బిర్యానీ, ఖుబానీ కా మీఠా, మరచిపోలేని రుచుల విందు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అదే ఆత్మీయత ఈరోజు మనందరినీ ఇక్కడికి తీసుకువచ్చింది అన్నారు. పెద్ద, ధైర్యవంతమైన, కొత్త ప్రపంచంలో భాగస్వాములు కావడానికి వచ్చిన అందరికీ డిప్యూటీ సీఎం హృదయపూర్వక ఆహ్వానం పలికారు. తెలంగాణకు ఆశయాల కొరత ఎప్పుడూ లేదు. కానీ ఎంతో కాలంగా ప్రజల శక్తిని, వారి ఆశలను, సామర్థ్యాన్ని ఒకే దారిలో నడిపించే సమగ్ర దృష్టి మాత్రమే కొరవడింది అన్నారు.
ఈరోజు ఆ సమగ్ర డాక్యుమెంటును ఆవిష్కరిస్తున్నాం అన్నారు. మా దూరదృష్టి
ఒక సంవత్సరం కోసం కాదు, ఒక ఎన్నికల కాలం కోసం కాదు, 2047 వరకూ ఉన్న దీర్ఘకాల లక్ష్యంతో నిర్మించిన విజన్ ఇది అన్నారు. మా విజన్ నాలుగు స్తంభాలపై నిలబడి ఉంది:
అందులో మొదటిది $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇది కేవలం నినాదం కాదు, అన్ని
రంగాలవారీగా, జిల్లాలవారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అని వివరించారు.
2.స్పేషియల్ ప్లానింగ్‌కు కొత్త వ్యాకరణం CURE, PURE, RARE.
3. సమగ్ర అభివృద్ధిపై అచంచల కట్టుబాటు.
4. సస్టైనబిలిటీనీ ఆవిష్కరణాత్మకంగా సహకారం చేయడం అన్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇది సంఖ్య కాదు, ఇది తెలంగాణ వాస్తవాన్ని మార్చే శక్తి అన్నారు.
ప్రతి పాఠశాలకు, ప్రతి ఆవిష్కరణకు, ప్రతి గ్రీన్ ఇనిషియేటివ్‌కు కావాల్సిన ఆర్థిక బలం,
ఇది మూలధనంపై నమ్మకం మాత్రమే కాదు సృజనాత్మకత, సామర్థ్యం, ధైర్యంపై. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి అన్ని డిప్యూటీ సీఎం వివరించారు. CURE–PURE–RARE స్పేషియల్ విజన్
• CURE – Core Urban Region Economy
హైదరాబాద్ అత్యంత చురుకైన రూపం; AI, ఏరోస్పేస్, జీనోమిక్స్, ఫ్యూచర్ ఇండస్ట్రీల కేంద్రం.
• PURE – Peri Urban Region Economy
ఉత్పత్తి, పరిశ్రమలు, లాజిస్టిక్స్—ఇవి జరిగే శక్తివంతమైన ప్రాంతం.
• RARE – Rural Agricultural Region Economy
మన వ్యవసాయభూములు, అడవులు, పచ్చని ఊపిరితిత్తులు, ఇవి అగ్రి ఎంట్రప్రెన్యూర్షిప్, ఈకో-టూరిజం, కార్బన్ ఎకానమీకి ఇంజిన్‌లు. ఈ మూడు కలిసి తెలంగాణ మొత్తం అభివృద్ధి కథను ఒక దందాలో దారం లా ఒక చోటుకు చేరుస్తాయి అన్నారు. CURE ఆవిష్కరిస్తుంది, PURE అందిస్తుంది, RARE నిలబెడుతుందనీ తెలిపారు. మహిళ శక్తి నుండి రైతు భరోసా వరకు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు ఇవి సంక్షేమం కాదు. ఇవి సమానత్వ నిర్మాణం, అభివృద్ధి ప్రయాణంలో ఎవరూ వెనుకబడకూడదు అన్నదే తెలంగాణ ప్రజా ప్రభుత్వ నినాదం అన్నారు. ప్రేరణకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాం, ఆ ఆలోచనల్లో ఒకటి
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సంస్థల పేర్లు రోడ్లు, మౌలిక వసతులకు పెట్టడం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఒక యువకుడు “టాటా అవెన్యూ” లేదా “గూగుల్ స్క్వేర్” వద్ద సైకిల్ తొక్కుతూ వెళ్తే… అది కేవలం పేరు కాదుఒక అవకాశ మార్గం, అతను నిర్మించగలిగే భవిష్యత్తు అని ప్రేరణ కలిగించడమే మా ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.
తెలంగాణ ప్రజలందరికి ఇది బ్లూప్రింట్ మాత్రమే కాదు ప్రజా ప్రభుత్వం వాగ్దానం అన్నారు.