డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది. ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. అందుకే ప్రజా ప్రభుత్వంలో ఈ రోజుని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే గత ఏడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నామని సీఎం అన్నారు. 2004 లో కరీంనగర్ గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ మ్యాట్ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.