- రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ. 588 కోట్లు
- ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తిచేసిన ప్రభుత్వం
- ప్రయోజనం పొందనున్న 55,904 మంది రైతులు
హైదరాబాద్: రేపటి నుండి మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమచేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 55,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ, రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వమే పంట సేకరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న రైతుల నుండి సేకరించబడిందని వెల్లడించారు. సేకరించిన ధాన్యానికి గాను రూ. 588 కోట్లు రేపటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్రం సహకారం లేకున్నా, రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూడటం తమ మొదటి ప్రాధాన్యమని మంత్రి నొక్కిచెప్పారు.