భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డా.మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్, నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.