
ముషీరాబాద్ నియోజక వర్గంలోని భోలక్‌పూర్ ఇందిరానగర్‌లోని ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ ఇన్చార్జి మీర్ మహ్మద్ అలీ తెలిపారు. ఈ మేరకు శనివారం భోలక్‌పూర్‌లోని సెట్విన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ ఏయిర్ కండీషనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు, ఫ్యాషన్ డిజైయినింగ్ కోర్సులలో 3 నుంచి 6 నెలల కాలపరిమితితో కూడిన ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులు 3వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు ముషీరాబాద్ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి మీర్ మహ్మద్ అలీని సంప్రదించాలన్నారు. అదే విధంగా 040-27532709 ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.