భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్

శుక్రవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గాన శ్రీశైలం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ కు చేరుకున్న భారతదేశ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాసేపు విరామం తర్వాత నేరుగా శ్రీశైలం దర్శనానికి బయలు దేరి వేళ్ళారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.