- నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచన చేస్తాం
సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్య అసాధ్యాల పై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాంజీ తో బేగంపేటలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ విట్టల్, సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్ సింగరేణి అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.