గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు నెల్లూరులో మొక్కలు నాటారు. నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి అనిల్ కుమార్‌కు ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ రోజు మూడు మొక్కలు నాటిన అనిల్‌ మరో ముగ్గురు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి , హీరో అర్జున్ లను గ్రీన్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత మంత్రి అనిల్‌ కుమార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకమని, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కల్ని నాటడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.