సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నగరంలోని చారిత్రక ప్రదేశాల సందర్శన

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఈసీ, ముందుగా గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గోల్కొండ కోటకు సంబంధించిన చారిత్రక, శిల్పకళా విశేషాలను పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు సీఈసీకి వివరించారు.

అనంతరం సీఈసీ హుస్సేన్‌సాగర్ను సందర్శించి, సరస్సు మధ్యలో ప్రతిష్ఠితంగా నిలిచిన బుద్ధ విగ్రహాన్ని దర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి సత్యవాణితో పాటు ఎన్నికల విభాగానికి చెందిన ఇతర అధికారులు సీఈసీతో ఉన్నారు. సాయంత్రం నగరంలోని ప్రసిద్ధ చార్మినార్ను సీఈసీ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.