రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన భారతదేశ ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా (World Meditation Day) చేగురులోని కన్హ శాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు . అనంతరం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఉప రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు, ఘనంగా వీడ్కోలు పలికారు.