ప్రభుత్వ అసుపత్రులలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి

  • అసుపత్రి వార్డుల్లో ఆహారం తింటే కఠిన చర్యలు..
  • అసుపత్రి సిబ్బంది, రోగుల సహాయకులకు నిర్థేశిత ప్రదేశాల లో బోజన వసతి..
  • ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఇనుప జాలీలు, సీలింగ్ లను ఏర్పాటు
  • పారిశుధ్యం పర్యవేక్షణకు ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్’ (IHFMS) విధానం
  • వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ అసుపత్రులలో నిర్థిష్టమైన విధానాల అమలుకు డీఎంఈ (DME) మార్గదర్శకాలు.

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సురక్షితమైన, స్వస్థత చేకూర్చే ‘పవిత్ర నిలయాలు’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ అదేశాల మేరకు అన్ని ప్రభుత్వ అసుపత్రులలో పారిశుధ్యం, భద్రత, ముఖ్యంగా ఎలుకలు, కీటకాల నియంత్రణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (IHFMS) విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ వైద్య విద్య డైరెక్టర్ (DME) డా. నరేంద్ర కుమార్ తాజగా మార్గదర్శకాలను జారీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణాల్లో ఎలుకల సమస్యను పూర్తిగా అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు.
సమస్యకు మూలం అదే..
ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకల సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా వార్డుల వద్దే ఆహారం వండటం, నిల్వ చేయడం మరియు భుజించడమేనని అధికారులు గుర్తించారు. రోగుల సహాయకులు మిగిలిపోయిన ఆహారాన్ని బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం, తెరిచి ఉన్న మురుగు కాలువలు ఎలుకల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
అసుపత్రులలో పారిశుధ్యం పై ప్రభుత్వం ఈ క్రింది కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది:
ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలు:
• పకడ్బందీగా సీలింగ్: ఆసుపత్రి భవనాల పగుళ్లు, రంధ్రాలను పటిష్టమైన మెటీరియల్‌తో మూసివేయాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్లు (OTs), ఐసీయూలు (ICUs), లేబర్ రూమ్‌లలో ఎటువంటి ఖాళీలు లేకుండా చర్యలను చేపట్టాలని సూచించారు.
• ఇనుప జాలీల ఏర్పాటు: కిటికీలు, వెంటిలేటర్లు, డ్రైనేజీ పైపులు మరియు సర్వీస్ డక్ట్‌లకు నాణ్యమైన ఇనుప జాలీలను (Wire mesh) అమర్చాలని అసుపత్రుల భాద్యులను సూచనలు జారి చేశారు.
• వార్డుల్లో భోజనం నిషిద్ధం: వార్డుల్లో రోగుల సహాయకులు ఆహారం వండుకోవడాన్ని, తినడాన్ని కఠినంగా నిషేధిస్తూ . భోజనాలను కేవలం నిర్దేశించిన ప్రదేశాలలో పరిమితం చేయాలని నిబందనలను కఠిన తరం చేయడం జరిగింది.
• వ్యర్థాల నిర్వహణ: అన్ని వార్డులలో మూత ఉన్న చెత్త డబ్బాలను (Closed Bins) ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని డి ఎమ్ ఈ ఆదేశించారు.
• అవగాహన కార్యక్రమాలు: ఆసుపత్రిలో పారిశుధ్యం పాటించేలా బహుభాషా సూచికలు, మైకుల ద్వారా రోగులకు, వారి సహాయకులకు నిరంతరం అవగాహన కల్పించాలని కోరారు.
• ఎరలు, బోన్లు: లైసెన్స్ పొందిన ఏజెన్సీల ద్వారా నిర్ణీత కాలవ్యవధులలో ఎరలు వేయడం (Baiting), బోన్లు (Trapping) ఏర్పాటు చేయడం వంటి చర్యలు నిరంతరం కొనసాగాలని సూచించారు.
నిరంతర పర్యవేక్షణ – జవాబుదారీతనం.
ప్రతి ఆసుపత్రిలో ‘హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ’ (HICC) చర్యలను పర్యవేక్షిస్తూ ‘పెస్ట్ కంట్రోల్ లాగ్‌బుక్’ను నిర్వహించాలన్నారు. పారిశుధ్య సిబ్బంది ఎలుకల ఉనికిని గుర్తిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తారు. అత్యంత కీలక విభాగాలైన ఐసీయూలు, ల్యాబ్‌లు, వంటశాలల బాధ్యతను ఆయా యూనిట్ హెడ్లు, సూపరింటెండెంట్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా నిర్వహించే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాల్లో పారిశుధ్యం పై పురోగతి సమీక్షాలని నిర్థేశించారు.
రోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు వైద్య విద్య డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ చర్యలు చేపట్టుతున్నామన్నారు.