గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరో అర్జున్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu – 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది. స్వయంగా రోజా వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని నగరి ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది. దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చెప్పట్టడం చాలా అభినందనియం అన్నారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు ఆర్కే సల్వామని, మరియు ఉత్తమ నటి కుష్బూ ని పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.