- పలుచోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు
- అక్రమస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారుల దాడులు
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు (ACB raids)చేపట్టారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌లో 15 బృందాలుకు పైగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్ కిషన్ నాయక్‌కు చెందినవిగా గుర్తించారు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.