హెటిరో పరిశ్రమను మూసేయాలి

  • ప్రాణాలను హరించే పరిశ్రమలపై చర్యలేవీ..
  • పరిశ్రమ కొనసాగితే మా భవిష్యత్తు ప్రశ్నార్ధకమే
  • ప్రాణాలు పోతున్నా చలించని అధికారులను ఏమనాలి
  • ఇప్పటి వరకు శాంపిల్స్ ఫలితాలను చెప్పని కాలుష్య నియంత్రణ మండలి
  • కాలుష్యం జరగకపోతే దొంగ చాటు మంతనాలు ఎందుకు..?
  • గ్రామంపై కపట ప్రేమ చూపి కంపెనీకి వత్తాసు పలికే నాయకులకు ఖబర్దార్
  • ఇప్పటికైనా మారండి.. మా పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి..
  • దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ

కాలుష్య కారక పరిశ్రమ హెటిరో యూనిట్ వన్ పరిశ్రమను వెంటనే మూసివేయాలని.. లేకుంటే మా బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకమని దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో దోమడుగు వార్డు విద్యార్థులు, చిన్నారులు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదన్నారు.. ఈ ప్రాంతంలో నివసించే గొడ్డు, గోదా, మనుషుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రాణాపాయం ఉందని తెలిసినా హెటిరో యూనిట్ వన్ పరిశ్రమ ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమ వదిలిన కాలుష్యం వల్ల నల్లకుంట చెరువు కాస్త ఎర్రగా మారిందని.. అలాంటి పరిణామాలను కండ్లకు కట్టినట్టు శాస్త్రవేత్తలు కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తెలియజేసిన పెడచెవిన పెడుతూ అధికారులు నిద్రమత్తు వహించడం పట్ల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కాలుష్య కారక పరిశ్రమ హిటిరో యూనిట్ వన్ పరిశ్రమను వెంటనే మూసివేయాలని లేనియెడల మా బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకమని దోమడుగు వార్డు విద్యార్థినీ విద్యార్థులు చిన్నారులు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బడీ చిన్నారులు విద్యార్థిని విద్యార్థులు దోమడుగు వార్డులో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న ఏ ఒక్క అధికారి గాని ఈ విషయంపై పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. దోమడుగు ప్రాంతంలో నివసించే గొడ్డు గోదా మనుషులు వారి జీవనాధారం రేపటికి ప్రశ్నార్థకమేనని వారు అన్నారు. ఇలాంటి స్థితిగతులు ఉన్న ప్రాంతంలో హెటిరో యూనిట్ వన్ పరిశ్రమ ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు, హెటిరో యూనిట్ వన్ పరిశ్రమ వదిలిన కాలుష్యం వల్ల నల్లకుంట చెరువు కాస్త ఎర్రగా మారిందని అలాంటి పరిణామాలను కండ్లకు కట్టినట్టు శాస్త్రవేత్తలు కాలుష్య నియంత్రణ మండలి సభ్యులకు తెలియజేసిన పెడచెవిన పెడుతూ పిసిబి అధికారులు నిద్రమత్తు వహించడం పట్ల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఇలాగే కొనసాగితే మా భవిష్యత్తు రేపటికి ఉండదని ఈ తరంలోనే మా చిన్నారుల భవిష్యత్తు కూడా ముగిసిపోతుందని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రైతులు పండించే పంటలు పాడి పశువులు విషపూరితపు ఆహారాలను తీసుకోవడం వల్ల చనిపోతున్నాయని అలాగే అలాంటి వ్యర్థ జలాలను పశువులపై జీవ నాధారం పొందుతున్న రైతుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చిన్నారు లు ఆవేదన వ్యక్తం చేశారు తమ తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కూలీలను వారు పండించే పంట పొలా లుపాలు చినుపదార్ధాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని ఇలాంటి తీవ్ర పరి స్థితిని అధికారులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని వారు అన్నారు.

ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోండి
అధికారులను కోరుతున్న దోమడుగు గ్రామ చిన్నారులు యువతీ యువకులు గత నాలుగు నెలలుగా తమ తల్లిదండ్రులు రైతులు చేస్తున్నటు వంటి పోరాటంపై ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల తమకు తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుందని చిన్నారులు తెలిపారు పరిశ్రమ నుండి వెలువడిన కలుషిత జలాలతో గ్రామంలోని నల్లకుంట చెరువు పూర్తిగా ఎర్రగా మారిందని దానికి గల కారణాలను వాటి శాంపిళ్లను సేకరించిన కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు వెంటనే వాటి తుది జాబితాను కాలుష్య నియంత్రణ మండలి సభ్యులకు దోమడుగు గ్రామ కాలుష్య నియంత్రణ కమిటీకి అందజేయాలని కోరారు తమలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నారులు మీకు కూడా ఉన్నారని తమలో మీ ఇంటిబిడ్డలను చూసుకుంటూ తమకు న్యాయం చేయాలని అధికారులను చిన్నారులు కోరారు.

  • పరిశ్రమకు తొత్తులుగా వ్యవహరించే రాజకీయ నాయకులారా ఖబర్దార్
  • మీ చిన్నారుల భవిష్యత్తు కూడా ఇందులోనే గమనించండి
  • ఇప్పటికైనా సరైన పద్ధతిలో నడవండి
  • కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ
    గ్రామంలో రాజకీయ నాయకులుగా చలామణి చేస్తున్న కొందరు హెటిరో యూనిటీ వన్ పరిశ్రమకు తొత్తులుగా వ్యవహరిస్తూ పది పరక ఆశ చూపి రైతులను దోమడుగు గ్రామస్తులను తప్పు దోవలో నడిపిస్తున్నారని అలాంటి వారి పిల్లలు కూడా ఇదే వార్డులో నివసిస్తున్నారు అన్నది మరిచిపోతున్నారని వారు అన్నారు ఇప్పటికైనా చాటుమాటు ఒప్పందాలను మానుకొని దోమడుగు వార్డు సభ్యుల బాగుకోసం వారి చిన్నారుల భవిష్యత్తు కోసం ఏకతాటిపై నడవాలని సూచించారు. (సోర్స్: ఆంధ్రప్రభ)