- సహకార సంఘాల వల్లే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
- డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయ రంగం
- 2024 _25 లో సహకార సంఘాల ద్వారా 7500 కోట్ల రుణాలు
- దేశంలోనే తొలి సారిగా తెలంగాణ లో పీ. ఏ.సీ.ఎస్ ల కంప్యూటరీకరణ
- వాణిజ్య బ్యాంకులతో సహకార బ్యాంకులు పోటీ పడాలి
- సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రైతు రాజ్యం..
- నాబార్డ్ కో ఆపరేటివ్ కాంక్లేవ్ లో మంత్రి తుమ్మల
సహకార సంఘాల వల్లే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని దేశ సహకార రంగంలో తెలంగాణ మార్గదర్శి గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ సహకార వారోత్సవాలు 2025 కార్యక్రమం సందర్భంగా నాబార్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కో ఆపరేటివ్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకార రంగమే ప్రాణం పోసిందన్నారు.సహకార సంఘాల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సహకార సదస్సులో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సహకారం అంటేనే గ్రామీణ అభివృద్ధి – “ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు” అన్న భావనే మన బలమన్నారు.
• తెలంగాణ రాష్ట్రం సహకార ప్రోత్సాహంలో దేశంలోనే ముందంజలో ఉందన్నారు.
సుస్థిర వ్యవసాయంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ విజయాలు ప్రస్తావిస్తూ
• 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతు, పెట్టుబడి సహాయం, రైతు బీమా పథకాలు అందిస్తున్నామన్నారు.
• రైతు నేస్తం ద్వారా నిపుణుల సలహాలు, సౌర సాగునీరు, యాంత్రీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నాం.
• ప్రభుత్వ సహకారంతో 1.89 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో దేశంలో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ నిలిచిందన్నారు.
• కంది, వేరుశెనగ వంటి పంటల్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
• తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం – ఇది కేవలం పథకం కాదు, పేదల గౌరవానికి చిహ్నమన్నారు.
• ఉద్యానవన రంగంలో 42 లక్షల టన్నుల ఉత్పత్తి – మిర్చి, పసుపు, ఆయిల్ పామ్ సాగు పురోగతిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు.
….ఆయిల్ ఫామ్ విస్తరణ తో దేశానికే మార్గదర్శి గా తెలంగాణ మారుతుందన్నారు
పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణతో లక్షలాది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపేలా పామాయిల్ సాగు ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
మక్క, పప్పులు, చిరుధాన్యాల సాగు చేసేలా రైతులకి అవగాహన కల్పించడం.
• వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వ్యవసాయరంగంలో ఆధునికతను పెంపొదించడం. తెలంగాణ విజన్ – 2047 లక్ష్యమన్నారు.
• రైతు ఆదాయం పెంచే, పర్యావరణాన్ని కాపాడే వ్యవసాయ వ్యవస్థే మా లక్ష్యం
• కొత్త సాంకేతికత, ఏఐ, ఐఓటీ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నామన్నారు.
• ఆహార, పోషక స్వయం సమృద్ధి సాధించడమే మా దీర్ఘకాల దృష్టి అన్నారు.
విజన్ డాక్యుమెంట్ – ప్రధాన అంశాలు వివరిస్తూ
• మొబైల్ సాయిల్ టెస్టింగ్ ద్వారా వాతావరణానికి తగ్గట్టు వ్యవసాయం
• పునరుత్పాదక శక్తితో వ్యవసాయ యాంత్రీకరణ
• 2047 నాటికి 4,000 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం
• 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్ మైక్రో ఇరిగేషన్
• ఆహార ప్రాసెసింగ్, విలువ జోడింపు, పరిశోధన కేంద్రాలు
• ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, ఉద్యానవన మెగా క్లస్టర్ల ఏర్పాటు
• 100 విత్తన హబ్ లు, సీడ్ రీసెర్చ్ పార్క్ లు ఏర్పాటు చేసి సీడ్ ఎగుమతులను పెంచడం
• కోల్డ్ స్టోరేజీలు, PACS & FPOల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
సహకార సంఘాల పాత్ర ప్రాధాన్యం వివరిస్తూ
• సహకార సంఘాలు రైతులకు రుణాలు మాత్రమే కాదు – విత్తనాలు, ఎరువులు, సేవలు కూడా అందిస్తున్నాయి.
• 2024-25 లో సహకార సంఘాల ద్వారా రైతులకు 7500 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.
• గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలే వెన్నెముక
• 311 PACSs లను FPO లుగా ఏర్పాటు చేయడం.
• దేశంలోనే మొదటగా PACSs ను కంప్యూటరీకరించడం
• సహకార బ్యాంకుల్లో డిజిటల్ సేవలు.
• ఆధార్ ఆధారిత చెల్లింపులు, బీమా సదుపాయాలు జరుగుతున్నాయన్నారు.
నాబార్డ్ పాత్ర గూర్చి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ
• గత దశాబ్దంగా నాబార్డ్ సహకార రంగాన్ని బలోపేతం చేస్తోంది
• PACSలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చడంలో కీలక సహకారం అందిస్తుంది.
• గోదాములు, సౌర విద్యుత్, శిక్షణ, డిజిటలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది.
• సహకార సంఘాలతోనే గ్రామీణ సంపద సాధ్యమని తెలంగాణ మరోసారి దేశానికి చాటి చెబుతుందనీ మంత్రి తుమ్మల పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రైతు రాజ్యం సాగుతుందని సహకార సంఘాలకు మరింత ప్రోత్సాహంతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు మంత్రి తుమ్మల. ఫెర్టిలేజర్ అమ్మకాలు విత్తన అమ్మకాలు , పెట్రోల్ బంక్ ల నిర్వహణ మొదలైన పరపతేర వ్యాపారంలో అత్యధిక పురోగతి సాధిoచిన మరియు రుణాల రికవరీలో 100 % పురోగతి సాధించిన రాష్ట్రంలోని 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు NABARD ద్వారా మంత్రి వర్యుల చేతుల మీదుగా అందించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కొండూరి రవీందర్ రావు నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్
ముంబై నాబార్డ్ సీజీఎం మణి కుమార్ ఆర్.బీ.ఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయనీ కుమార్
డీసీసీబీ సీ ఇ ఓ లు మరియు నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.
