పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి -ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం
సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చింతపల్లి మండలం బొత్య తండాకి చెందిన శాంతికి రూ.1,25000లు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కును ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ బాధితునికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతు.. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్నారు. ఆపదలో సీఎం సహాయ నీధి ఆపద్భందువునిగా ఆదుకుంటుంది అని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసిరామ్, అశోక్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.