- గతంలో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వస్తున్నాం
- మీ సమస్యలపై నన్ను ఎప్పుడు కలవాలన్న ప్రత్యేక అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు
- కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి
- నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారి
- ఈ కొత్త సంవత్సరంలో అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తాం
- ఫీల్డ్ లో ఉండే ఏ.ఈ లకు ల్యాప్ టాప్ లు అందజేస్తాం
- ఇప్పటికే అన్ని రకాల ప్రమోషన్స్ ఇచ్చుకున్నాం..మిగతా పెండింగ్ అంశాలు కూడా సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తా..
- రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నది
- నూతన ప్రాజెక్టులతో అభివృద్ది పథాన సాగుదాం..మీరు కష్టపడి పనిచేయండి..మంచి పేరు తీసుకురండి
- మీకు ఏమి కావాలన్నా ముఖ్యమంత్రిని అడిగి ఒప్పించే బాధ్యత తీసుకుంటా
- ఏపీ విభజనకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్థాం
- అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
- ఆర్ అండ్ బి డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- IRC ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన ఈఎన్సీ మోహన్ నాయక్ ను సన్మానించిన మంత్రి
- డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ను,కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి
- ఆర్ అండ్ బి చరిత్రలో కార్యాలయానికి వచ్చి డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించి, ఆప్యాయంగా మాతో గడిపిన మొదటి మంత్రి కోమటి రెడ్డి గారని ఆనందం వ్యక్తం చేసిన ఇంజినీర్లు
హైదరాబాద్: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అని,తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారనీ ఆర్ అండ్ బి అధికారులకు కితాబిచ్చారు. 2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం నాడు ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ అండ్ బి ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని శాఖ ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ R&B డైరీ–2026 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో ఉపయోగకరమైన సాంకేతిక సమాచారం,శాఖా మార్గదర్శకాలు, దైనందిన విధుల నిర్వహణకు అవసరమైన వివరాలతో ఈ డైరీని రూపొందించినందుకు తెలంగాణ రోడ్లు,భవనాల ఇంజినీర్ల సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్న అన్నారు. ఇది ఇంజినీర్లు మరియు ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తుందనీ,కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారన్నారు. తనకు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఫ్యామిలీ లాగా అని గతంలో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వస్తున్నామన్నాడు. మీ సమస్యలపై నన్ను ఎప్పుడు కలవాలన్న ప్రత్యేక అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదనీ భరోసానిచ్చారు.
ఉద్యోగుల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తామని, ఫీల్డ్ లో ఉండే ఏ.ఈ లకు ల్యాప్ టాప్ లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అన్ని రకాల ప్రమోషన్స్ ఇచ్చుకున్నాం.. మిగతా పెండింగ్ అంశాలు కూడా సిఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నదన్నారు. కాలేజీలు, టిమ్స్,నిమ్స్,ఉస్మానియా హాస్పిటల్స్, హైకోర్టు,జిల్లా కోర్టులు, కలెక్టరేట్లు తో పాటు 60వేల కోట్ల విలువైన రోడ్లు డబుల్ లేన్,ఫోర్ లేన్,6లేన్ రోడ్లు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని అన్నారు. హ్యామ్ రోడ్లు 11,399 కోట్లతో త్వరలో కొలిక్కి రానుందని ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతా అన్నారు. రానున్న రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు కు సమాంతరంగా రూరల్ రోడ్లు డెవలప్మెంట్ చేయాలని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చి,ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మంచి రోడ్లు ఉన్నప్పుడే ఇది సాధ్యమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లమన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా మొదటి సారి ఆర్ అండ్ బి రోడ్ పాలసీని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. శాఖ విజన్ కు నిదర్శనమన్నారు. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్,గ్రీన్ ఫీల్డ్ హైవేలు,ఎన్నో గొప్ప కార్యక్రమాలతో ఆర్ అండ్ బి ముందుకు సాగుతోందనీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అతిపెద్ద డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అని కొనియాడారు.కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తనకు ఉన్న పరిచయంతో 2ఏళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2వేల కోట్ల CRIF నిధులు తెచ్చామని చెప్పారు. నూతన ప్రాజెక్టులతో అభివృద్ది పథాన సాగుదాం.. మీరు కష్టపడి పనిచేయండి.. మంచి పేరు తీసుకురండి అని ఉద్యోగులకు హితబోధ చేశారు. మీకు ఏమి కావాలన్నా ముఖ్యమంత్రిని అడిగి ఒప్పించే బాధ్యత తీసుకుంటానని,ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నా హయాంలో రోడ్లు & భవనాల శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించామని గుర్తు చేశారు. AEs to AEEs – 38 Nos, AEEs to DEEs – 118 Nos, DEEs to EEs – 72 Nos, EEs to SEs- 29 Nos,
SEs to CEs-5 Nos, CEs to ENC-3 Nos అదేవిధంగా, శాఖను మరింత బలోపేతం చేసే దిశగా 153 AEEs, 38 AEs, 60 JTO నియామకాలు కూడా చేపట్టామన్నారు.
ఇక మరో ముఖ్యమైన విషయంగా, ఏపీ విభజనకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని, ఆ సమస్యలు పరిష్కారమైన వెంటనే, సీనియారిటీ ప్రకారం అన్ని కేడర్లలో పదోన్నతులు మంజూరు చేయబడతాయన్నారు. అదే విధంగా, రోడ్లు & భవనాల శాఖలో ఉన్న 265 AEEs మరియు AEs ఖాళీ పోస్టులను కూడా అత్యంత త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిలో రోడ్లు మరియు భవనాల శాఖ పాత్ర అత్యంత కీలకమైనది. అందుకే మీరు అందరూ నిబద్ధత, నిజాయితీ, బాధ్యతతో పనిచేసి, నాణ్యమైన పనులు చేసి, “రైజింగ్ తెలంగాణ” – అభివృద్ధి చెందుతున్న తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రోడ్లు & భవనాల ఇంజినీర్ల సంఘాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు,బి.వి రావు,లింగారెడ్డి, వసంత్ నాయక్,నర్సింగ్ రావు,పలువురు ఎస్.ఈ లు,ఈ.ఈ లు ఇంజనీర్లు,ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్..కార్యవర్గ సభ్యులు,ఆర్ అండ్ బి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.