- లబ్ధిదారుల పక్షాన ప్రభుత్వం 3,593 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించింది
- శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానం గా ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 52, 82, 498 లక్షల మంది కాగా వీరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593.17 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 25,35,560 లక్షల మంది కాగా ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 లక్షల మంది ఉన్నారు అని తెలిపారు. ఈ పథకం ద్వారా 52 ,82 ,498 లక్షల కుటుంబాలకు 3,593.17 కోట్లు బాగా అవడం మూలంగా వారు సామాజికంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లలను మంచి చదువులు చదివించుకునేందుకు ఈ పథకం ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.