- గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతానికి ఆసుపత్రులను అనుసంధానం చేస్తున్నాం.
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలను అందించటం వరం..
- RMP , PMP ల అంశం న్యాయస్థానం పరిధి లో ఉన్నది..
- RMP , PMP ల సమస్యల పరిష్కరానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది..
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ శాసన మండలిలో వెల్లడి..
- శాసన మండలి లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ RMP /PMP లపై గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు..
పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల మంత్రిగా సేవలను అందించటం వరం గా భావిస్తున్నామన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తున్న సబ్ సెంటర్స్ , ఆరోగ్య మందిర్ లను , CHC కేంద్రాలను , ఏరియా ఆసుపత్రులను , GGH లకు అనుసంధానం చేస్తున్నామన్నారు . RMP / PMP లకు గతంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు . అనంతరం RMP , PMP లకు శిక్షణ ఇవ్వటం పై IMA – తెలంగాణ , డాక్టర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు ను అశ్రహించటం తో న్యాయపరమైన అంశాలు కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నాయన్నారు . RMP , PMP ల సమస్యల పరిష్కరానికి కట్టుబడి ఉన్నామన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ .