- తెలంగాణ సాంస్కృతిక, సామాజిక పురోగతికి కృషిచేసిన అందే శ్రీ వారి కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం
జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించింది, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి ంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అందెశ్రీగా పిలవబడే అందే ఎల్లయ్య తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో అనాధ అయిన అందెశ్రీ పశువుల కాపరిగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని గీత రచయితగా ఎదిగారు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎటువంటి సాధికారత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ మరియు అనగారిన వర్గాలను ప్రతిబింబించేలా ఆయన 3 వేల కవితలు .రచించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, పోరాటాలు వాటి స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిందని తెలిపారు. గౌరవనీయమైన వ్యక్తికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీ వారసత్వం తెలంగాణ అంతట కొనసాగుతుంది అన్నారు. అందెశ్రీ విప్లవాత్మక కవితలు భావోద్వేగంతో కూడిన గేయాలు కార్మికులు, రైతులు, అణగారిన వర్గాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి పోరాటాలను వ్యక్తీకరించాయి, తెలంగాణ సంస్కృతికి స్వరంగా నిలిచాయి అన్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని 2- జూన్- 24 న 783 జీవో ద్వారా ఆమోదించిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి వారు అందించిన అమూల్యమైన సేవలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వారి అకాల మరణంతో నష్టపోయిన వారి కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా ఎదుర్కొనే సవాళ్లపై సకాలంలో మానవీయ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయ సూత్రాలు, పరిపాలన సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వివరించారు. ఈ చర్య తెలంగాణ ఐక్యత, పురోగతికి తన జీవితాన్ని అంకితం చేసి సాంస్కృతికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీని గుర్తించి గౌరవించి ప్రభుత్వం కుటుంబానికి హామీ ఇస్తుందని తెలిపారు. తెలంగాణ సమాజం అంటేనే కవులు కళాకారులు, వారి దగ్గర ఉన్న కలలు అన్నీ పీడిత ప్రజల విముక్తి కోసం సమ సమాజ నిర్మాణం కోసం, వారి ఆశయాలు ఆశలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో చాలామంది కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంటూ వచ్చిందని తెలిపారు.
అందెశ్రీ గేయం జయ జయహే తెలంగాణ ఈ సమాజాన్ని ఏ విధంగా మేలుకొలిపిందో అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయ గీతాన్ని పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చినాక ఆనాటి పాలకులు ఆ గేయాన్ని, మనిషిని వదిలేసిన గత ప్రభుత్వాన్ని చూసాం అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడగానే ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నామో రాష్ట్ర ప్రజలందరూ చూశారని తెలిపారు. దురదృష్టవశాత్తు అందే శ్రీ అకాల మరణం చెంది మన మధ్య లేకపోవడాన్ని చింతిస్తూనే వారి గౌరవాన్ని పెంపొందిస్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని వారు రాసి, పాడిన పాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. మానవత్వంతో ఈ ప్రభుత్వం అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్త సాయి కి ఉన్నత విద్యా శాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించినట్టు తెలిపారు తెలిపారు. 25 నవంబర్ 20 25న ఆర్డినెన్స్ 7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని, ఆరోజు శాసనమండలి సమావేశంలో లేనందున ఆ ఆర్డినెన్స్ ను ఈరోజు అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షనీయం అన్నారు.