ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న మ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్య, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్,,మున్సిపల్ చైర్ పర్సన్స్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, చైతన్య వంతంగా ఉండాలి అన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు అందంగా రూపుదిద్దుకుంటాయి. వర్డ్ లాల్లో ఏర్పాటు చేసిన కమిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమ ఫలితాలు ప్రజలు కళ్లారా చూసారు. పల్లె ప్రగతి స్పూర్తితో పట్టణ ప్రగతిని కూడా చేయి చేయి కలిపి అందరం కలిసివిజయవంతం చేయాలి అన్నారు.