- ఆధునిక పరిజ్ఞానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
- సైలో ఆధారిత ధాన్యం నిలువకు మార్గాన్వేషణ
- ఆహార భద్రతను పెంపొందించడంతో పాటు పంట భద్రతకు ప్రణాళికలు
చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిలువ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా రైతుకు భరోసా కల్పించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభ తరమౌతుందని ఆయన పేర్కొన్నారు. యావత్ భారత దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణా రాష్ట్రం అగ్రగామిగా నిలుచుండడంతో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతు చేతికందిన ధాన్యాం నష్ట పోకుండా ఉండేందుకు గాను ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైలో వ్యవస్థను అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో భారత ఆహార సంస్థ,రాష్ట్ర పౌర సరఫరాల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సైలో పద్దతిలో బియ్యం ,మొక్క జొన్న, సోయాబీన్ వంటి పంటలను కుడా నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. మనుషుల జోక్యం లేకుండానే సైలో పద్దతిలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లినర్లు,డ్రైయర్లతో రెండు సంవత్సరాల వరకు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్ లో జరుగుతున్న జాప్యంతో ధాన్యం చేడి పోయి నష్టం వాటిల్లుతుందని,మిల్లులలో శాస్త్రీయ పద్దతిలో నిల్వ చేసే అవకాశం లేక పోవడంతోటే ఈ నష్టం వతిలుతుందని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితిలలో రైతాంగానికి భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం శాస్త్రీయమైన సైలో పద్ధతిని అమలులోకి తేవాలి అనే ఆలోచనకు శ్రీకారం చుట్టమన్నారు.
తద్వారా ధాన్యం కొనుగోలు సమయంలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైలో పద్దతిలో ఉండే డ్రైయర్ల ద్వారా తేమను తొలగించడంతో పాటు దాన్యన్ని దీర్ఘకలికాంగ పరిరక్షించు కోవచ్చని ఆయన తెలిపారు. అంతే గాకుండా పాత బియ్యానికి మార్కెట్ లో అధిక ధర లభిస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ప్రభావం దేశ వ్యాప్తంగా చూపుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పేదలకు ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ,సన్నాలకు 500 బోనస్ వంటి సంస్కరణలతో దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందన్నారు. ఆ క్రమంలోనే చేతికొచ్చిన పంట పాడవకుండా ఉందెందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేవలనుకుంటున్న సైలో ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున ప్రయోజనం ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టేసి మిల్లింగ్ అయిన బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంతో కొనుగోలుకు మిల్లింగ్ కు మద్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,000 కోట్లు నష్ట పోతుందని…సైలో పద్ధతిని అమలులోకి తెస్తే 5,000 కోట్ల భారాన్ని అధిగమించడంతో పాటు 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.