మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గ పర్యటన

రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో 17. 50 లక్షలతో 50 పడకల CHC ఆసుపత్రి ని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అప్గ్రేడ్ (స్థాయిగా పెంపుదల ) చేస్తూ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 95 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులను ఆప్యాయంగా పలుకరించారు. వారికి అందుతున్న చికిత్స , డాక్టర్స్ పనితీరు ను , ఆసుపత్రిలోని ఇతర సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో స్థానిక శాసన సభ్యలు కాలే యాదయ్య , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గోన్నారు.