నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

  • స్ట‌డీ స‌ర్కిల్ లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
  • గ్రూప్ 1 ట్రైనీల‌తో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నూత‌న ఆలోచ‌నలు చేసి స‌రికొత్త కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళుతోందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. వివిధ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా మీరు అత్యంత నిబ‌ద్ద‌త‌తో ముందుకు వెళ్లాల‌న్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డిన స్థానం నుంచి వ‌చ్చిన మీరు రేప‌టి రోజున వెనుక‌బ‌డిన వారికి, స‌మాజంలో నిల‌దొక్కుకోవాడినికి ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి మీరంతా తోడ్పాటును అందించాలన్నారు. సోమ‌వారం నాడు ప్ర‌జాభ‌వ‌న్ లో తెలంగాణ ఎస్సీ స్ట‌డీ స‌ర్క‌ల్ లో శిక్ష‌ణ పొంది గ్రూప్ 1 సాధించిన శిక్ష‌ణ‌పొందుతున్న వారికి మెమంటోలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యంత్రితో పాటు మంత్రివ‌ర్యులు అడ్లూరి ల‌క్ష్మ‌న్ కుమార్‌, ఎంపీ బ‌ల‌రామ్ నాయ‌క్, ఎమ్మెల్యే రాందాస్ నాయ‌క్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చాక స్ట‌డీ స‌ర్కిల్ లో మౌలిక వ‌స‌తులు ఏమిధంగా మెరుగు ప‌రిచ‌మామో మీకంద‌రికీ తెలుసన్నారు. ఇప్ప‌డున్న వ‌సతుల‌ను మ‌రింత‌గా మెరుగుప‌రిచేందుకు వ‌చ్చే ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుందని చెప్పారు.

ట్యాంక్ బండ్ వ‌ద్ద అంబేద్క‌ర్ భ‌వ‌న్ ముందున్న ఎక‌ర‌మున్న‌ర స్థ‌లాన్ని బాగు చేపించి అక్క‌డ నిరంత‌రం విద్యాస‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా గ్రూప్ 1కు ఎంపికై శిక్ష‌ణ పొందుతున్న మీకు శుభాకాంక్ష‌లు చెప్పారు. సుదీర్ఘ‌కాలం మీరు ఈ ఉన్న‌త స్థాయి ఉద్యోగాల్లో ఉంటారు.. భ‌విష్య‌త్ లో మీ ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున సేవ చేయాల‌న్నారు. మీ త‌ల్లిదండ్రులు గౌర‌వింప‌ప‌డేలా, స‌మాజం హ‌ర్షించేలా మీరంతా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌పంచంలో మీరు త‌ట్టుకుని నిల‌బ‌డి గ్రూప్ 1 వ‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించ‌డం అంత‌మాషీ కాదన్నారు. భ‌విష్య‌త్ లో మీరు ప‌నిచేసే వివిధ హోదాల్లో ద‌శాబ్దాల పాటు ప‌నిచేయ‌బోతున్నారు. ప్ర‌జ‌ల క్షేమం కోసం ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీ ప‌రిధిలో చిత్త‌శుద్ధితో అమ‌లు చేయాలని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క చెప్పారు.