- నగదు బదిలీల ఆధారంగా లంచం తీసుకుంటున్నట్లు నిర్ధారణ
- ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి నిజాలు
- ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం : ఏసీబీ డీఎస్పీ రమేశ్
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎస్ఆర్ఓ ఖదీరిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఏసీబీ డీఎస్పీ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ, భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఖదీర్ గతంలో బూర్గంపాడు మండలంలో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు ఉన్నపు 2025 జూన్ నెలలో ఆకస్మికంగా ఏసీబీ దాడులు నిర్వహించారు. అప్పుడు నిర్వహించిన తనిఖీలలో ఎస్ఆర్ఓ బ్యాంకు ఖాతాకు పలు అకౌంట్స్ నుండి నగదు బదిలీ అయిందని, వాటిలో కార్యాలయం సిబ్బంది అకౌంట్స్ కూడా ఉన్నాయని, నగదు బదిలీ జరిగినవి లంచంగా స్వీకరించినట్లుగా గుర్తించడంతో గురువారం పూర్తి స్థాయి విచారణ చేపట్టాన్నారు. తమ విచారణలో నిజాలు బయటపడటంతో ఎస్ఆర్ఓ ఖదీర్ ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు.