మా ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోంది: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే మా టార్గెట్.
  • భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
  • రీజినల్ రింగ్ రోడ్డు మా గేమ్ చేంజర్…ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు కు 39 రేడియల్ రోడ్లు నిర్మాణం చేస్తున్నాం
  • ఐటీ,ఫార్మా,ఏఐ లాంటి పోటీ రంగాలను ప్రోత్సహిస్తున్నాం..పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
  • హైదరాబాద్ అన్ని రంగాల్లో పురోగమిస్తోంది.. రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉన్నది.ఇటీవల జరిగిన యాక్షన్ లో ఎకరం 174కోట్లు పలికింది
  • మీకు హైదరాబాద్ ఎటు చూసినా హై రైజ్ భవనాలు కనిపిస్తాయి
  • మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు అందుబాటు ధరలో సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నాం
  • అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ది చేస్తూ…పరిశ్రమల స్థాపన..ఉపాధి కల్పన అంశాలపై ప్రధాన దృష్టి సారించాం
  • పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నాం..ఇక్కడ జరిగిన ఇంత మంచి చర్చపై క్యాబినెట్ లో ప్రస్తావిస్తా..
  • ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో జరుగుతున్న “ఏస్ టెక్ హైదరాబాద్ 2026″కు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఏస్ టెక్ ఫౌండర్&చైర్మన్ సుమిత్ గాంధీ ఆధ్వర్యంలో ముదిత్ గుప్తా ప్రారంభించిన ప్యానల్ డిస్కషన్ లో మంత్రి పాల్గొని ప్యానల్ సభ్యులు, పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. “ఇన్ఫ్రాస్ట్రక్చర్,ఆర్కిటెక్చర్,రియల్ ఎస్టేట్,ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్” అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిర్మాణరంగ ప్రముఖులు ఎస్పీ రెడ్డి, దామోదరన్, ఫైసల్ వోహ్రా,రూపాన రెడ్డి,స్నేహిత్ రెడ్డి మేడ, సుప్రజా రావు, వీర్ ప్రకాశ్ యాదవ్,పార్థ కర్మాకర్,స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,NAC DG శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..ప్యానెల్ డిస్కషన్ లో పలువురు బిల్డర్లు,ఆర్కిటెక్ట్ లు లేవనెత్తిన పలు ప్రశ్నలు,సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంను మంత్రి ఈ సందర్భంగా వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తం అయ్యాయి. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశం పై యువ బిల్డర్స్ అడిగిన ప్రశ్నకు మంత్రి అభినందించారు. క్యాబినెట్ దృష్టికి ఇక్కడి చర్చను తీసుకువెళ్తానని చెప్పారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాల్స్ ను మంత్రి ప్రారంభించి,కలియ తిరిగారు. ఆర్కిటెక్టులు,బిల్డర్లు ఏర్పాటు చేసిన ఒక్కో స్టాల్ సంబంధిత అంశాలపై మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “ఇంత పెద్ద, ఇంత ముఖ్యమైన ET ACE-TECH హైదరాబాద్ 2026 వేదికపై మీమధ్య మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ACE-TECH అనేది ఒక ఎగ్జిబిషన్ మాత్రమే కాదు. ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త ఐడియాలు, కొత్త టెక్నాలజీలు, కొత్త అవకాశాలు అన్నీ ఒకచోట కలిసే ప్లాట్‌ఫామ్. ఆర్కిటెక్టులు, బిల్డర్లు, మాన్యుఫ్యాక్చరర్స్, ఇన్వెస్టర్లు — అందరూ కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే చోటే ఇది. తెలంగాణ గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తోంది. మంచి రోడ్లు, స్ట్రాంగ్ బిల్డింగ్స్, ప్లాన్డ్ సిటీస్, మోడ్రన్ కనెక్టివిటీ — ఇవన్నీ మా ప్రభుత్వ ఫస్ట్ ప్రైయారిటీలు. ఈ డెవలప్‌మెంట్‌లో కన్‌స్ట్రక్షన్, డిజైన్ రంగాల పాత్ర చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోంది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే మా టార్గెట్. ఈ దిశలోనే గత ఏడాది భారత్ ఫ్యూచర్ సిటీలో చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ – 2025 చాలా పెద్ద సక్సెస్ అయింది. దాని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు డావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం – 2026లో కూడా తెలంగాణ విజన్ 2047 గురించి మాట్లాడుతూ,
ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి సెక్టార్స్‌లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

మా గోల్ చాలా క్లియర్. 2047 లోపు $3 ట్రిలియన్ టార్గెట్ రీచ్ చేయాలి. దానికి కావాల్సిన ప్లాన్ మీద ఇప్పటికే పని జరుగుతోంది, ఈ టార్గెట్ మేం తప్పకుండా అచీవ్ చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ACE-TECH లాంటి ఈవెంట్స్ వల్ల ప్రపంచంలో ఏం జరుగుతోంది అన్నది మనకు తెలుస్తుంది. గ్రీన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ కన్‌స్ట్రక్షన్, స్మార్ట్ మెటీరియల్స్ — ఇవన్నీ ఫ్యూచర్‌కి చాలా ఇంపార్టెంట్. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు చూస్తున్న మంత్రిగా,
ఈ రంగాలను ఇంకా బెటర్‌గా తీసుకెళ్లడమే నా కమిట్‌మెంట్. ఇక్కడ ఉన్న మీ అందరి ఎక్స్‌పీరియన్స్, ఐడియాస్ మాకు చాలా ఉపయోగపడతాయి. మన లక్ష్యం కేవలం ఈరోజు వరకే కాదు. ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా మంచి లివింగ్ కండిషన్స్ ఇవ్వాలి. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీ కావాలంటే ట్రాన్స్‌పోర్ట్ చాలా కీలకమైన విషయం. అందుకే ప్రభుత్వం HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల పాలసీ తీసుకొచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో 6,000 కిలోమీటర్ల రోడ్లు, దాదాపు రూ. 11,399 కోట్ల ఖర్చుతో డెవలప్ చేయబోతున్నాం.

ఈ ACE-TECH ఎడిషన్‌లో 300కి పైగా ఇండియన్ & ఇంటర్నేషనల్ బ్రాండ్లు పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ గ్రోత్‌లో భాగం కావాలనుకునే వాళ్లతో ప్రభుత్వం కలిసి పని చేయడానికి రెడీగా ఉంది. ఇది హైదరాబాద్ బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎంత బెస్ట్ డెస్టినేషన్ అనేదానికి ప్రూఫ్. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే.. తెలంగాణలో ఉన్న అపర్చునిటీస్‌ని చూడండి, మీ ఐడియాస్ మాతో షేర్ చేయండి, గ్రీన్, స్మార్ట్, బెటర్ సిటీస్‌ని కలిసి నిర్మిద్దాం. ఇన్నోవేషన్, క్వాలిటీ డెవలప్‌మెంట్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ ఈవెంట్‌ని సక్సెస్ చేసిన ACE-TECH హైదరాబాద్ టీమ్‌కు, మరియు ఇక్కడ ఉన్న మొత్తం ఇండస్ట్రీ ఫ్యామిలీకి నా బెస్ట్ విషెస్. మనందరం కలిసి పని చేస్తే, స్ట్రాంగ్, సస్టైనబుల్ ఇండస్ట్రీని తప్పకుండా నిర్మించగలం.” అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.