రూ. 6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

  • మంత్రి సీతక్క చొరవతో SHG మహిళలకు లబ్ది

మహిళాభ్యున్నతికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పుకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించుటకు ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ. 6 కోట్ల వ్యయంతో 565 షాపులను ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 లొకేషన్లలో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు. అందులో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్స్, మేడారం రాక పోకలు జరిగే మార్గంలో 63 యూనిట్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్స్ ఇతర చోట్ల నెలకొల్పారు. ఇందిరా మహిళా శక్తి పధకం కింద SERP bank linkage రూ. 341.30 లక్షలతో 315 యూనిట్స్, SERP CIF నిధులు రూ. 86.50 కోట్లతో 80 units, స్త్రీనిధి రూ. 92 లక్షలతో 90 units, Mandala సమాఖ్య CIF రూ. 64 లక్షలతో 60 units, గ్రామ సమాఖ్య నిధులు రూ. 19.50 లక్షలతో 20 units ను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , RWS & Womensnd Child Welfare శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ- సీతక్క చొరవతో మేడారం జాతర సందర్బంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ ద్వారా ఈ ప్రాంత సంఘాల మహిళలు లబ్ది పొందనున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్ప పువ్వు లడ్డులు, మిల్లెట్ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డులు విక్రయ స్టాల్స్, ఇప్ప నూనె, Cold press oil, కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ/టిఫిన్, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామాగ్రీ విక్రయ స్టాల్స్ తో పాటు బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్ డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహర, కిరాణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ ఫిష్ & కర్రీ అవుట్ లెట్, కోళ్ల విక్రయ అవుట్ లెట్, కోడి గుడ్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా ఆయా కుటుంబాలు ఆర్ధికముగా అభివృద్ధి చెందనున్నాయి. మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పధకం అండగా నిలుస్తుంది.