సీఎం రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌జాస్వామిక‌, గ‌ణ‌తంత్ర‌, లౌకిక‌, సామ్య‌వాద‌, సార్వ‌భౌమ దేశంగా భార‌త దేశం ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకెళ్లాల‌ని… అందుకు ఆధారమైన రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన జ‌న‌వ‌రి 26వ తేదీ దేశ ప్ర‌జ‌లంద‌రికీ పండుగ వంటిద‌ని సీఎం పేర్కొన్నారు. జాతీయోద్య‌మ నాయ‌కులు, రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ‌, ప్ర‌జాహిత కార్య‌క్ర‌మాల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని సీఎం తెలియ‌జేశారు.