- రూ.251 కోట్లతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులు
- రద్దీని తట్టుకునే క్యూ లైన్లు, శాశ్వత గద్దెలు, ఆధునిక వసతులు
- జనారణ్యమైన మేడారం అటవీ ప్రాంతం, ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్న ఒక క్తి పైన భక్తులు
మేడారం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర గా గుర్తింపు పొందిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర–2026ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది. మొత్తం రూ.251 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు పూర్తి అయ్యి భక్తుల మన్ననలు పొందుతున్నాయ్. భక్తుల సర్వత్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు మాఘ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ జాతరకు “తెలంగాణ కుంభమేళా”గా విశేష ఖ్యాతి ఉంది. లక్షలాది కాదు… కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతర ఈసారి పునర్నిర్మాణ పనుల వల్ల మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
2026 మహాజాతర తేదీలు
• జనవరి 28: సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెప్రవేశం
• జనవరి 29: చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెప్రవేశం
• జనవరి 30: భక్తుల మొక్కులు
• జనవరి 31: వనప్రవేశంతో జాతర ముగింపు
తాత్కాలికం కాదు… శాశ్వత నిర్మాణాలు
గతంలో ప్రతి జాతర సందర్భంగా తాత్కాలిక వసతులతో సరిపెట్టిన పరిస్థితికి భిన్నంగా, ఈసారి వందల ఏళ్లపాటు నిలిచేలా పూర్తి రాతి కట్టడాలతో గద్దెల చుట్టు పునర్నిర్మాణం చేపట్టారు. ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘం సంపూర్ణ ఆమోదంతోనే ప్రభుత్వం ఈ పనులకు శ్రీకారం చుట్టింది. గద్దెల విస్తరణకు మాత్రమే రూ.101 కోట్ల. సుమారు 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా నిర్మించారు. 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
శిలలపై ఆదివాసీ చరిత్ర….
మేడారం గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, జీవనశైలి, కోయ వంశ చరిత్రను శిల్పాల రూపంలో చెక్కించారు. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా రూపొందించిన ఈ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నతో పాటు ప్రకృతిలో మమేకమై జీవించే ఆదివాసుల జీవన వైవిద్యాన్ని ప్రతిభింబించే పులి, జింక, ఏనుగు, నెమలి వంటి వన్యప్రాణుల ప్రతిరూపాలు చెక్కించారు. సుమారు 750 కోయ ఇంటి పేర్లు, 7,000కు పైగా శిల్పాలు గిరిజన చరిత్రను భావితరాలకు తెలియజేసేలా రూపొందించారు.
రహదారులు, క్యూ లైన్లు, పార్కింగ్
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 60 అడుగుల నుంచి నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ, శాస్త్రీయ క్యూ లైన్లు, వాచ్ టవర్లు, సత్రాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా 42 ప్రదేశాల్లో 1,418 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లుల ధర్శనానికి సకల ఏర్పాట్లు – జనంరణ్యమైన ములుగు అటవీ ప్రాంతం మేడారం ఊ చేరే అన్ని రహదారులు వాహనాల రాకపోకలు, భక్తుల గుడారలతో ములుగు అటవీ ప్రాంతం. ముఖ్యం గా తాడ్వాయి మదలం గత నెల రోజుల నుండి రద్దీగా గా మారింది. జాతర ముఖ్య గట్టలు ప్రారంబమైనందున మేడారం జనారణ్యమైంది. గత జాతరకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరవ్వగా, ఈసారి మూడు కోట్ల మంది వస్తారని అంచనా. గత నెల రోజుల నుండి దాదాపు 1 కోటి పైన భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణ పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 21 శాఖల సమన్వయంతో 42,027 మంది అధికారులు, సిబ్బందిని విధులు నిర్వహిస్తున్నారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించారు. అన్నీ సెక్టార్ లకు వాకీ టాకీ లను ఏర్పాటు చేసి సెక్టార్ వారీగా ఏ ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయం తో పని చేస్తున్నారు.
రవాణా, వైద్య, భద్రతా చర్యలు
టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా 4,000 బస్సులు, 51,000 ట్రిప్పులు నడపనున్నారు.
వైద్య సేవల కోసం 108 అంబులెన్సులు, బైక్ అంబులెన్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ద్వారా ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తునారు. స్పెషలైస్డ్ డాక్టర్స్ మందులు అన్నీ అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక, SDRF బృందాలు, జంపన్నవాగులో ఈతగాళ్లను మోహరించారు. జంపన్న వాగులో భక్తులు ప్రమాదం బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు.
డిజిటల్ మేడారం:
డిజిటల్ యుగం లో మేడారం సమాచారాన్ని అంధిచేందుకు డిజిటల్ వేదికను జిల్లా యంత్రాంగం యెంచుకున్నది. భక్తుల సౌకర్యం కోసం మేడారం జాతర 2026 మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్, ‘My Medaram’ వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. భక్తులకు మేడారం జాతర పూర్తి సమాచారం డిజిటల్ ప్లాట్ ఫామ్ అందిస్తున్నారు.
పార్కింగ్, వైద్య శిబిరాలు, టాయిలెట్లు, SOS సేవలు, మిస్సింగ్ పర్సన్స్ వివరాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
ప్లాస్టిక్ రహిత జాతర…
అరణ్యమే ఆలయం… ప్రకృతే దేవత అన్న ఆదివాసీ తత్వానికి అనుగుణంగా ఈసారి ప్లాస్టిక్ రహిత మేడారం నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుడి పై వుందని మంత్రి సీతక్క , జిల్లా collector T.S. దివాకర పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యవేక్షణలో, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సారథ్యంలో ఈసారి మేడారం మహాజాతరను ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
