ఫారెస్ట్‌ ఆఫీసర్లు పోలీసులు కాదు: హైకోర్టు

పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా త్రమే ఉంటుందని తేల్చింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు మాత్ర మే అటవీ అధికారులకు వీలుంటుందని పేర్కొన్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో అక్రమంగా ప్రవేశించి అధికారిపై దాడిచేసినట్టు ఆరోపిస్తూ నమో దు చేసిన ప్రాథమిక నేర నివేదికను కొట్టేయాలంటూ మేడ్చల్‌ మలాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన సాయిరోహిత్‌ సహా ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జే శ్రీనివాసరావు ఇటీవల విచారణ జరిపారు. ఐపీసీ కింద వారు కేసులు నమోదు చేయ డం చెల్లదని తెలిపారు.