ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహ‌ణ‌లో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన వారి పైన క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని సీఎం హామీ ఇచ్చారు.