సిగాచీ పరిశ్రమ ఎండీ, డైరెక్టర్లకు బెయిల్‌

సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 62 మంది కార్మికులు మరణించిన సంఘటనలో సిగాచీ పరిశ్రమ మేనేజింగ్‌ డైరెక్టర్‌-సీఈవో, ఇతర డైరెక్టర్లుకు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది. నెలరోజులపైగా జైలు జీవితం గడిపిన సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాకు సింగిల్‌ జడ్జి ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. మిగిలిన డైరెక్టర్లకు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. అలాగే, కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు అయిన రవీంద్ర ప్రసాద్‌ సిన్హా, బిందు వినోదన్‌, జీ ధనలక్ష్మి, వై జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఆమోదించింది.