
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సింక్రోని ఇండియా కార్పొరేట్ హెడ్ వెంకట్ టంకశాల పాల్గొని, కొండాపూర్‌లోని టెంపుల్ పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమములో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వెంకట్ టంకశాల పిలుపునిచ్చారు. దేవరాజన్ దివ్య, సంధ్యారాణి కానేగంటి, మయూర్ పట్నాల, సూజీ బూర్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు వెంకట్.