డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: సిఎస్ రామకష్ణారావు

హైదరాబాద్ : రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా (రిటైర్డ్ ఐఎఎస్) అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరి రాజీవ్‌గాంధీ హన్మంతు, ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీలోగా డిసిఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్ ఐసి అధికారుల సహకారంతో సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 10, 877 గ్రామాల్లో డిసిఎస్ సర్వే చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. సీజినల్ డిజిటల్ క్రాప్ సర్వే వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపకరిస్తుందని, అదేవిధంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జిఎస్‌డిపి) గణాంకాలకు ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. దేశంలోని యుపి, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తి అయిందని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ చావ్లా తెలిపారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గోపి ఇప్పటి వరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శులు లోకేశ్‌కుమార్, సురేంద్రమోహన్, రాజీవ్‌గాంధీ హన్మంతు, వ్యవసాయశాఖ