మూడు కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్‌

కొత్తగా ఏర్పాటుచేసిన మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్‌గా హెచ్‌ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)తో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేసింది. వీటికి ప్రత్యేకంగా కమిషనర్లను నియమించిన ప్రభుత్వం వారిపై ప్రత్యేక అధికారిని నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను కొనసాగించింది. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జీ శ్రీజన, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది.