నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రకాశం బజార్ లో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి వేయించిన మంత్రి

నల్గొండకు గుండెకాయ ప్రకాశం బజార్. ప్రకాశం బజార్ లో రోజు 10,000 మంది వ్యాపారం నిమిత్తం ప్రజలు వస్తుంటారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు, షాపులు ఉండేవి ఏలాంటి ఇబ్బంది అయ్యేది కాదు. వ్యాపారాలు పెరగడం, జనాభా పెరగడం వల్ల ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందువల్లనే రోడ్డుపై ఫూట్ పాత్ పై ఉన్న పూలు,పండ్లు, దుకాణాలు,ఇతర చిన్న చిన్న షాపులను పాత కలెక్టరేట్ స్థలంలోకి తరలిస్తున్నాం. పూలు ,పండ్ల వ్యాపారులు ఎవరికి అన్యాయం జరగనీయం. పాత కలెక్టరేట్ స్థలంలో ఉన్న డీసీఎంలను దేవరకొండ రోడ్ లో ఉన్న హౌసింగ్ బోర్డ్ స్థలంలోకి తక్షణమే తరలింపు. వీధి వ్యాపారులందరికి స్థలం కేటాయింపు. 50, 70, 100 గజాల వారీగా స్థలాల కేటాయింపు. వారి వారి షాపుల పరిణామాన్ని బట్టి స్థలంకేటాయింపు. 60 ,70 షాపుల వాళ్ళు మాత్రమే ప్రకాశం బజార్లో ఫూట్ పాత్ పై ఉన్నారు. వీరందరికి స్థలాలు కేటాయిస్తాం అన్నారు. నేను పేదల మనిషిని. పేదలకు అన్యాయం చేయను. పేదలకు సహాయం చేస్తానన్నారు. ప్రజలకు మేలు కలిగిందుకే ఈ పని. ప్రజలకు మేలు కలిగిందుకే ఈ పని. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అన్నారు. ప్రకాశం బజార్ రాకముందే లతీఫ్ షాప్ గుట్ట,పట్టణంలోని తదితర ప్రాంతాలను సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.