- ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివాసేనరెడ్డి
- పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహణ-మంత్రి వాకిటి శ్రీహరి
- విద్యార్థులు, యువతీ, యువకులు సీఎం కప్‌లో పాల్గొనాలి-మంత్రి వాకిటి శ్రీహరి
ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభంకానున్న సీఎం కప్-2026 కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డిని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివాసేనరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ MD సోనిబాలాదేవి లు ఆహ్వానించారు. తెలంగాణలోని పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థులు, యువతీ,యువకుల్లో దాగి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్‌ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.