తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

  • మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్ 2025 -26 కు సాంకేతిక హంగులు సమకూర్చి క్రీడాకారులకు ఇష్టమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత CM’s cup GAMES, CM’s Cup: GAMES – Agentic AI call centre. App : Nilamani నీ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి డాక్టర్ సోని బాలాదేవి లతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ క్రీడా రంగానికి పెద్ద పీట వేసే లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించే విధంగా తెలంగాణ క్రీడా శాఖ సీఎం కప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువకులు, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా మైదానాలకు తరలి రావాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు గ్రామీణ మండల అసెంబ్లీ జిల్లా స్థాయిలో పాల్గొని అందులోంచి 22,000 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే విధంగా సీఎం కప్ గేమ్స్ పేరిట నీలమణి యాప్ ద్వారా ఏఐ కాల్ సెంటర్ ద్వారా 24 గంటల సమాచారాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. 44 క్రీడాంశాలు 12 జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఈ క్రీడలనుంచి మంచి ఛాంపియన్లు వృద్ధిలోకి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పలువురు పాల్గొన్నారు.