- యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు చేపట్టండి
- దేశంలో నే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు
- సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పరిశీలన నిరంతరం జరగాలి
- లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుంది
- సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి
- ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయిస్, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ లతో కలిసి డిప్యూటీ సీఎం ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్ తో కలిసి మైనార్టీ సంక్షేమ శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆలోచించి, నిబద్దతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆదాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సంక్షేమ శాఖకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు ఎంత తొందరగా పంపితే అంత తొందరగా క్లియర్ చేస్తామని, వసతి గృహాల భవనాల మరమ్మత్తులు వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్ని వర్గాల విద్యార్థులు ఉమ్మడి కుటుంబం లా కలిసిపోవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కు బయోమెట్రిక్ విధానం లేకపోతే వెంటనే అమలులోకి తీసుకురావాలని వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
వసతి గృహాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ ల పైన సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో సమావేశమై ఏర్పాటు చేసుకోవాలని కరెంటు భారం లేకుండా చేసుకోవడమే కాదు, సోలార్ ద్వారా ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు.
వసతి గృహాలు, సంక్షేమ హాస్టళ్లకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం కొత్త మెనూ అమల్లోకి తీసుకు వచ్చాం, వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం వి నేపథ్యంలో జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి అన్ని విషయాలను పరిశీలించాలని వీలైతే ఒక రోజు రాత్రి అక్కడే బస చేయాలని గతంలోనే ఆదేశించాం, ఆ ప్రక్రియ ఎంత మేరకు కొనసాగుతుందో సెక్రటరీలు ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ జరపాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వసతి గృహాల అధ్యలను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. హాస్టల్ బిల్డింగుల మరమ్మతు బిల్లులు ఉంటే వెంటనే పంపాలని వెనువెంటనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. వరి సాగు పెద్ద ఎత్తున చేయడం, బాయిల్డ్ రైస్ ను తమిళనాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పంట మార్పిడికి అవకాశాలను పరిశీలించాలని నీటిపారుదల శాఖ సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు. వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగు చేస్తూ, పంట నిలువల స్టోరీ ఈ సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం బీసీ లకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పిస్తుంది.. బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రీన్ చానెల్ ద్వారా డైట్ & కాస్మొటిక్ ఛార్జీలు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు విడుదల చేస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు అద్దెలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంచేదని ప్రజా పాలన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టల్ ప అద్దెలు చెల్లిస్తుంది. ఈసారి బడ్జెట్ లో బీసీ లలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి వారి ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని కోరడం జరిగిందనీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహా లక్ష్మీ ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా జరుగుతుంది. ప్రభుత్వం మహా లక్ష్మీ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. మహా లక్ష్మీ కి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో బస్సులు సంఖ్య కూడా గణనీయంగా పెంచడం జరుగుతుంది. త్వరలోనే ఆర్టీసీ లో ప్రయాణించే మహిళలకు మహా లక్ష్మీ కార్డులను ప్రతి ఇంటింటా పండగల అందించడం జరుగుతుందనీ పోను ప్రభాకర్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కు వచ్చి ఆర్థికంగా, ఇతరత్రా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. దేశంలో, రాష్ట్రంలో అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని ఇది దేశంలోనే ఒక మోడల్ గా మారబోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విలువైన స్థలాల్లో భారీ బవంతులు నిర్మించి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు భవనాలు నిర్మించే ఆలోచనలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రతి మూడు నెలలకు మిస్ చార్జీలు, అద్దెలు క్లియర్ చేయడం అభినందనీయమని అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు.
సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్లో మోడల్ కిచెన్లు ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని ఈ ప్రక్రియను దశలవారీగా ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. Ham, RRR, హైదరాబాద్- విజయవాడ, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు రహదారుల నిర్మాణం పనులు విదశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశంలో సంతకం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలో సంవత్సరం పొడుగునా కల్చరల్ యాక్టివిటీ కొనసాగేలా సినిమాటోగ్రఫీ శాఖలో ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సంక్షేమ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, రవాణా,రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంక్షేమ శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
