వారం రోజులలో జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలు: కమీషనర్ సి.హెచ్. ప్రియాంక

జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డి.పి.ఆర్.ఓ.లను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక ఆదేశించారు. శుక్రవారంనాడు నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమి ఆడిటోరియంలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధి విధానాలపై డి.పి.ఆర్.ఓ.లకు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జి.ఓ. నెం.252, 103లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పి.ఆర్.ఓ.లకు సూచించారు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులతో ఒక కమిటీని వారం రోజులలో పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రిలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, అప్రూవూడ్ లిస్టులు, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ మెంట్, అక్రిడిటేషన్ కార్డుల డౌన్ లోడింగ్, మొదలగు అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు. అదే విధంగా అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా రిలేషన్ వింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే టెక్నికల్ టీమ్ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వారిని కూడా సంప్రదించి ఎలాంటి తప్పులను ఆస్కారం లేకుండా అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆమె కోరారు.

తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని డి.పి.ఆర్.ఓ.లను ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో అక్రిడిటేషన్ జారీలో ఏమైన సమస్యలు ఉంటే స్పెషల్ కమీషనర్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ శిక్షణా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల డి.పి.ఆర్.ఓ.లు, సంబంధిత సిబ్బంది హజరయ్యారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఆన్ లైన్ విధి విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లేవనెత్తన అంశాలపై మీడియా రిలేషన్ విభాగం అధికారులు డి.ఎస్.జగన్, యామిని, వెబ్ సైట్ టీమ్ మేనేజర్ నంద, టెక్నిషన్ సాయిలు అధికారుల సందేహాలను నివృత్తి చేశారు.

అర్హత గల జర్నలిస్టులు http://ipr.telangana.gov.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్ నెం.: 9154170881ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస్, రమణ, మధుసుదన్, జాయింట్ డైరెక్టర్లు వై. వెంకటేశ్వర్లు, హష్మీ, రాజారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని, తదితరులు పాల్గొన్నారు.