- ఈ నెల 25న హాజరుకావాలని ఆదేశం
- రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శులకు నోటీసులు
- ఈ కాలుష్య పరిశ్రమను కాపాడుతున్న పిసిబి అధికారులు ఎవరు..?
- సిమెంట్ పరిశ్రమలలోనే అత్యంత కాలుష్య పరిశ్రమ అని చెప్పొచ్చు..?
- పిసిబిలోని నిజాయితీ కలిగిన అధికారితో ఇన్స్ పెక్షన్ చేపిస్తే క్లోజర్ ఆర్డర్ ఇవ్వాల్సిందే..?
- అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలే కాదు.. కాలుష్యంలోను నెంబర్ 1…!
- అధికారులకు లంచాలు ఇస్తే చాలు.. మేం ఏం చేసిన చెల్లుతుందనా వీరి ధీమా..?
- దక్కన్ సిమెంట్స్ కాలుష్యం పిసిబి అధికారులకు ఎందుకు కనపడటం లేదో.. ఆ దేవుడికే తెలియాలి..
- కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదంటున్న ఫిర్యాదుదారులు..
- కొంత మంది పిసిబి అధికారులు చేస్తున్న తప్పులపై మరిన్ని ఆధారాలతో త్వరలో మరో కథనంతో మీ ముందుకు..
పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ విచారణ జరుపనున్నది. ఇందుకు సంబంధించి దక్కన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని సైదుల్ నామ రిజర్వ్‌డ్ ఫారెస్ట్ భూమిలో జరిగిన అక్రమాలపై పసుపులేటి సురేశ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, ప్రధాన మంత్రి కార్యాలయానికి, సుప్రీంకోర్టు పరిధిలోని సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదును పరిశీలించిన సీఈసీ.. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని గతంలో నోటీసులు జారీ చేసింది. దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించింది.
సిమెంట్ పరిశ్రమలలోనే అత్యంత కాలుష్య పరిశ్రమ అయినటువంటి దక్కన్ సిమెంట్స్ పరిశ్రమను కాపాడుతున్న పిసిబి అధికారులు ఎవరు..? ఇది చుట్టు పక్కల ఉన్న సిమెంట్ పరిశ్రమలలోనే అత్యంత కాలుష్య పరిశ్రమ అని స్థానికులు చెపుతున్నారు. ఈ పరిశ్రమ చేసే కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని మేం చేసిన ఫిర్యాదులను కూడా వారి స్వార్ధనికి వాడుకుంటున్నారు అని స్థానికులు చెబుతున్నారు. పిసిబిలోని నిజాయితీ కలిగిన అధికారితో దక్కన్ సిమెంట్స్ పరిశ్రమను తరువుగా ఇన్స్ పెక్షన్ చేపిస్తే క్లోజర్ ఆర్డర్ ఇవ్వాల్సిందేనని కూడా తెలిపారు. కానీ పిసిబి అధికారులు మాత్రం సిమెంట్ పరిశ్రమ యజమాన్యంతో కుమ్మక్కై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు,. ఈ దక్కన్ సిమెంట్ పరిశ్రమ అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాదు.. పిసిబి నిబంధనలను తుంగలో తొక్కి కాలుష్యంలోను నెంబర్ 1 గా ఉందని కానీ పిసిబి అధికారులకు లంచాలు ఇస్తే చాలు.. ఈ పరిశ్రమ ఏం చేసిన పట్టించుకోరని వీరి ధీమాగా కనపడుతుందని స్థానికులు వాపోతున్నారు. దక్కన్ సిమెంట్స్ పరిశ్రమ చేసే కాలుష్యం పిసిబి అధికారులకు ఎందుకు కనపడటం లేదో ఆ దేవుడికే తెలియాలి అని ఈ పరిశ్రమ కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదంటున్న ఫిర్యాదుదారులు వారు చెప్పే నిజాలు.. దక్కన్ సిమెంట్స్ పరిశ్రమ చేసే అరాచకాలు.. కొంత మంది పిసిబి అధికారులు చేస్తున్న తప్పులపై మరిన్ని ఆధారాలతో త్వరలో మరో కథనంతో మీ ముందుకు..