99 రోజుల యాక్షన్ ప్లాన్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు

రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటుంది ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్ లో 99 డేస్ యాక్షన్ ప్లాన్ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ స్థాయిల్లో ఏ తరహా కార్యక్రమాలు చేపట్టాలి, వివిధ శాఖలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, పూర్తి సమాచారంతో కూడిన నివేదికల రూపొందించడం అనే అంశాలను నివేదికలో జోడించాలని మంత్రులు సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, యోగితా రానా, క్రిస్టిన, అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.